ఆ వ్యాధితో...అపుడసలు బుర్ర పని చేయలేదు : స్టార్‌ హీరోయిన్‌

20 Feb, 2024 13:01 IST|Sakshi

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి పరిచయం అవసరం లేదు. కేవలం నటనతోనేకాకుండా బోల్డ్ స్టేట్‌మెంట్‌లు, జిమ్‌లో  కసరత్తులు చేస్తూ అభిమానులను ఇన్‌స్పైర్‌ చేస్తూ ఉంటుంది. అయితే ఇంత ఫిట్‌గా ఉన్న ఈ అమ్మడు కూడి ఇటీవల గుండెజబ్బు బారిన పడింది. తనకు ఆరోగ్యానికి  సంబంధించి కొన్ని విషయాలను  ఇటీవల ఒక ఇంటర్య్వూలో  వెల్లడించారు.

మార్చి 2023లో, ఆమెకు గుండెపోటు రావడంతో స్టెంట్‌ అమర్చాల్సి వచ్చింది.  కానీ కొద్ది రోజుల్లోనే  మంచి వ్యాయాయంతో   తిరిగి ఫిట్‌ నెస్‌ను సాధించింది. అప్పటినుంచి వివిధ ఇంటర్వ్యూలలో తన ఆరోగ్య పరిస్థితి గురించి నిస్సంకోచంగా వెల్లడిస్తూ వస్తోంది. సుస్మిత చివరిగా వెబ్ సిరీస్ ఆర్య సీజన్ 3లో కనిపించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  తల్లిదండ్రులిద్దరూ హార్ట్ పేషెంట్లని అందుకే తాను కూడా అప్రత్తమంగా  ఉండేదాన్ని చెప్పుకొచ్చింది.  గుండెపోటు తర్వాత  తాను ఆపరేషన్ థియేటర్‌లో నవ్వుతున్నానని సుస్మిత వెల్లడించింది. అలాగే దీని తర్వాత  తన ఆమె జీవనశైలిలో వచ్చిన మార్పుల గురించి  కూడా  వెల్లడించింది.  తాను చాలా హ్యాపీ గోయింగ్‌ మనిషిని అని తెలిపింది. 

అలాగే తన ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌ గురించి కూడా సుస్మితా సేన్ ఓపెన్ అయింది.  తన జీవితంలో పెద్ద సమస్య అని, ఆ సమయంలో  తన  మెదడు  మొద్దు బారి పోయిందనీ,  ఇప్పటికీ చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకోలేకపోతున్నానని పేర్కొంది 2014లోనే సుస్మిత ఆడిసన్స్ వ్యాధిబారిన పడిందట. ఆటో ఇమ్యున్ సిస్టంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే  డిప్రెషన్‌కు లోనైంది.  కార్టిసోల్ వంటి స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల విపరీతమైన సైడ్ ఎఫెక్ట్ లతో  బాధపడ్డానని కూడా తెలిపింది సుస్మిత. ప్రస్తుత కఠోర సాధనతో సాధారణ స్థితికి వచ్చానని కూడా తెలిపింది. 

whatsapp channel

మరిన్ని వార్తలు