బ్లాక్‌ యాపిల్‌ గురించి విన్నారా? ఒక్కొక్కటి ఏకంగా..

8 Oct, 2023 11:29 IST|Sakshi

యాపిల్స్‌లో చాలా రకాలు మనకు తెలుసు. ఎక్కువగా ఎరుపు రంగులోను, ఎరుపు పసుపుల కలగలుపు రంగులోను, లేతాకుపచ్చ రంగులోను ఉంటాయి. ఈ నల్లని యాపిల్స్‌ వాటన్నింటి కంటే భిన్నమైనవి. ఇవి అత్యంత అరుదైనవి. ఈ నల్లని యాపిల్స్‌ చైనా అధీనంలో ఉన్న టిబెట్‌లోని న్యింగ్‌చీ పరిసర ప్రాంతాల్లో పండుతాయి. ఇవి చైనాలోని ఎరుపురంగు యాపిల్స్‌ అయిన ‘హువా నియు’ యాపిల్స్‌ జాతికి చెందినవే!

టిబెట్‌లోని వాతావరణ పరిస్థితి కారణంగా పగటి వేళల్లో ఎండ కాసేటప్పుడు వీటిపై అల్ట్రావయొలెట్‌ కిరణాలు పడటం, రాత్రివేళల్లో హఠాత్తుగా ఉష్ణోగ్రత తగ్గిపోవడం కారణంగా ఈ ప్రాంతంలో పండించే ‘హువా నియు’ యాపిల్స్‌ పూర్తిగా నలుపు రంగులోను, నేరేడుపండ్ల మాదిరిగా ముదురు ఊదారంగులోను పండుతాయి. అందువల్ల వీటికి బ్లాక్‌ డైమండ్‌ యాపిల్స్‌ అనే పేరు వచ్చింది. ఈ యాపిల్స్‌ చైనా మార్కెట్‌లో ఒక్కొక్కటి 50 యువాన్ల (రూ.575) వరకు పలుకుతాయి. 

(చదవండి: భలే ఉద్యోగ ప్రకటన!..ప్రపంచయాత్రకు సహాయకుడు కావలెను..!)

మరిన్ని వార్తలు