The Pretty Ankle Contest: అందాల పోటీలు: మీరు ఎలా ఉన్నా పర్వాలేదు.. కాళ్లు బావుంటే చాలు

7 Jul, 2023 15:58 IST|Sakshi

అందాలపోటీలు అనగానే అందమైన యువతులు స్టైల్‌గా ర్యాంప్‌వాక్‌ చేస్తున్న దృశ్యం మన కళ్లముందు కనిపిస్తుంది. 90వ దశకం నుంచి సౌందర్యపోటీలు వెలుగులోకి వచ్చాయి. బ్యూటీ విత్‌ ఏ పర్సన్‌ అన్నట్లు బాహ్య సౌందర్యమే కాదు, అంతః సౌందర్యం కూడా చాలా ప్రధానం. ఈ పోటీలు వివిధ దశల్లో జరుగుతుంటాయి. అయితే 1930 -53 కాలంలో చెప్పులతో అందాల పోటీలు జరిగేవి. వినడానికి విడ్డూరంగా ఉన్నా సౌందర్యం చూసో, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ చూసో కాకుండా కాళ్లను చూసి విజేతలుగా ప్రకటించేవారు. 


సౌందర్య పోటీల్లో వస్త్రధారణ, ర్యాంప్‌వాక్‌ వంటివి ప్రత్యేక ఆకర్షణ. అయితే 1900 ప్రారంభంలో మహిళల అందాల పోటీల్లో "ది ప్రెట్టీ యాంకిల్ కాంటెస్ట్" ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పోటీల్లో పాల్గొనే మహిళలు ముఖం చూపించకుండా తెర వెనుక నిల్చుంటారు. మోకాలి కింద వరకు డ్రెస్‌ చేసుకొని అందరూ ఒకే వరుసలో నిల్చుంటారు. ఈ పోటీల్లో ప్రధానంగా కాళ్లను బట్టి విజేత ఎవరో ప్రకటించేవారు.

అల వైకుంఠపురములో సినిమాలో పూజాహెగ్డే కాళ్లను చూసి అల్లు అర్జున్‌ మెస్మరైజ్‌ అయినట్లు ఈ యాంకిల్ కాంటెస్ట్ పోటీల్లో అందమైన కాళ్లతో ఫిదా చేయాలన్నమాట. సాధారణంగా అందాల పోటీల్లో పాల్గొనేవారు అవివాహితులై ఉండాలి కానీ యాంకిల్ కాంటెస్ట్‌కి మాత్రం ఈ రూల్‌ అవసరం లేదు. ఎవరైనా ఈ పోటీల్లో పార్టిసిపేట్‌ చేయొచ్చు. ఇక మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే..ఈ పోటీలకు పోలీసులు లేదా క్లర్క్‌ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు. 

మరిన్ని వార్తలు