నాడు యాంకర్‌ నేడు ఎమ్మెల్యేగా! అదీకూడా అతి పిన్నవయస్కురాలిగా..

6 Dec, 2023 10:50 IST|Sakshi

ఇటీవల ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వాటిలో నాలుగు రాష్ట్రాల​ ఫలితాలు డిసెంబర్‌ 3న ప్రకటించగా, ఒక్క మిజోరాం అసెంబ్లీ ఫలితాలు మాత్రం డిసెంబర్‌ 4న ప్రకటించడం జరిగింది. ఆ ఫలితాల్లో బారిల్‌ వన్నెహ్సాంగి అనే మహిళ ప్రధాన ఆకర్షణగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంతకీ ఎవరీమె? ప్రత్యేకత ఏంటీ అంటే..

40 మంది సభ్యులు ఉన్న మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో జెడ్‌పీఎం అభ్యర్థిగా బారిల్‌ బరిలోకి దిగి మిజో నేషనల్‌ ఫ్రంట్‌ అభ్యర్థిని గద్దెదించింది. దీంతో ఆమె అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యేగా నిలిచింది. ఆమె వయసు జస్ట్‌ 32 ఏళ్లే. బారిల్‌ ఐజ్వాల్‌ సౌత్‌ -III నుంచి పోటీకి దిగి, మిజో నేషనల్‌ ఫ్రంట్‌ అభ్యర్థి(ఎంఎన్‌ఎఫ్‌) లాల్నున్మావియాను 9.370 మెజార్టీ ఓట్లతో ఓడించి విజయం సాధించింది 

ఇక ఆమె నేపథ్యం చూస్తే..మేఘాలయాలోని షిల్లాంగ్‌లో నార్త్‌ ఈస్టర్న్‌ హిల్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ను అభ్యసించింది. ఆమె ప్రముఖ టీవీ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించి..క్రమంగా సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రాంలో బాగా ఫేమస్‌ అయ్యింది. ఆమెకు ఏకంగా దాదాపు 250కి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రేజే ఆమెను ప్రజలకు మరింత చేరువ చేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుక దోహదపడింది. ఇకఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం..ఆమె గతంలో ఐజ్వాల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎంఏసీ)లో కార్పొరేటర్‌గా పనిచేశారు. ఆమెపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవు. ఇక ఇదే రాష్ట్రం నుంచి బారిల్‌ వన్నైసంగీలానే మరో ఇద్దరు మహిళలు గెలుపొందడం విశేషం. వారిలో ఒకరు మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) అభ్యర్థి.

(చదవండి: ఫోర్బ్స్‌ జాబితాలో నలుగురు భారతీయులకు చోటు! సీతారామన్‌ ఎన్నో స్థానంలో ఉన్నారంటే..?)

>
మరిన్ని వార్తలు