రాష్ట్రాల అసమానతలు తొలగాలంటే...

14 Dec, 2023 00:16 IST|Sakshi

అభిప్రాయం

16వ ఆర్థిక సంఘం (ఫైనాన్స్‌ కమిషన్స్) నియామకం త్వరలో జరగనుందని భావిస్తున్నారు. 15వ కమిషన్స్ ఏర్పాటైన 2017తో పోలిస్తే ఇప్పుడు ప్రపంచ, దేశీయ సవాళ్లు భిన్నంగా ఉన్నాయి. కోవిడ్‌–19 ప్రేరేపించిన ఆర్థిక షాక్‌లు, భౌగోళిక రాజకీయ సవాళ్లతో సహా ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితిని 16వ కమిషన్స్ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఫైనాన్స్ ్స కమిషన్స్ మినహా మరే ఇతర ప్రభుత్వ సంస్థ కూడా రాష్ట్రాల మధ్య అసమానతలపై దృష్టి సారించలేదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి అన్నారు. కొన్ని రాష్ట్రాలు అఖిల భారత పేదరిక నిష్పత్తిలో చాలా వెనుకబడి ఉన్నాయి. 16వ ఆర్థిక సంఘం ఈ అసమానతలను పరిశీలించి, ఆర్థిక పరిష్కారాలను అందించాలి.


2022–23లో కేంద్రం, రాష్ట్రాల సంయుక్త లోటు, అప్పులు వరుసగా 10 శాతం, 89 శాతంగా ఉన్నాయి. కేంద్ర పన్ను రాబడిలో రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలి అనే క్షితిజ లంబ(వెర్టికల్‌) వాటాలనూ, దాన్ని రాష్ట్రాల మధ్య ఎలా పంపిణీ చేయాలి అనే క్షితిజ సమాంతర(హారిజాంటల్‌) వాటాలనూ ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. కేంద్ర పన్నుల భాగస్వామ్య పూల్‌లో రాష్ట్రాల వాటాలను 14వ ఆర్థిక కమిషన్స్ 32 నుండి 42 శాతానికి పెంచింది. అయితే రాష్ట్రాల సంఖ్యను 28కి తగ్గించినప్పుడు, రాష్ట్రాల వాటాను 41 శాతంగా 15వ కమిషన్స్ సిఫార్సు చేసింది. 2022–23లో 6.5 శాతం ఆర్థిక లోటు, 58 శాతం అప్పుతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక అసమతుల్యతతో ఉన్నందున ఈ వాటాను పెంచే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. 

అయితే, 16వ ఆర్థిక కమిషన్స్ సెస్సులు, సర్‌ఛార్జీల అంశాన్ని పరిశీలించాలి. 2011–12లో ఉన్న 10 శాతం నికర పన్ను రాబడి (జీటీఅర్‌) నుండి 2019–20కి 20 శాతానికి పెరిగింది. వాస్తవానికి, కేంద్ర జీటీఅర్‌లో రాష్ట్రాల నిష్పత్తి 2018–19లో ఉన్న 36.6 శాతం నుండి 2022–23లో 30.2 శాతానికి తగ్గింది. సెస్సులు, సర్‌చార్జ్‌ల కోసం 10 శాతం జీటీఅర్‌ గరిష్ఠ పరిమితిగా ఉండాలని రంగరాజన్, శ్రీవాస్తవ సూచించారు. కమిషన్స్ దీనిని సిఫారసు చేయవచ్చు. అది 10 శాతాన్ని దాటితే, కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటాను పెంచవచ్చు. మరో మాటలో చెప్పాలంటే– సెస్సులు, సర్‌ఛార్జ్‌ల వాటాపై ఆధార పడి క్షితిజ లంబ వాటాను మార్పు చేయవచ్చు.

పెరుగుతున్న అంతరాలు
ఫైనాన్స్ ్స కమిషన్స్ అమలు చేస్తున్న క్షితిజ సమాంతర పంపిణీ ఫార్ములా అనేది, రాష్ట్రాల అసమానతలను పరిష్కరించడానికి ఒక ముఖ్యమైన పరికరం. ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి అసమాన తలపై రాసిన ఒక కథనంలో, ఫైనాన్స్ ్స కమిషన్స్ మినహా మరే ఇతర ప్రభుత్వ సంస్థ కూడా రాష్ట్రాల మధ్య అసమానతలపై దృష్టి సారించలేదని సూచించారు. అంతకుముందు ప్రణాళికా సంఘం తలసరి ఖర్చులు కూడా ధనిక రాష్ట్రాలకే ఎక్కువగా ఉండేవి. కేంద్ర ప్రాయో జిత పథకాలకు తగిన వాటా రాష్ట్రాలు చెల్లించగలగాలి. కానీ దేశీయ మార్కెట్‌ రుణాలు, బాహ్య రుణాల నిబంధనలు, షరతులు ధనిక రాష్ట్రాలకు అనుకూలంగా ఉంటాయి.

అభివృద్ధి చెందిన రాష్ట్రాలలోనే పరిశ్రమ, వ్యాపారం కేంద్రీకృతమై ఉన్నందున బ్యాంక్‌ రుణ పరపతి తిరోగమనంగా ఉంటుంది. కేంద్ర పన్ను రాయితీలు కూడా తిరోగ మనంగానే ఉంటాయి. 12వ ఆర్థిక సంఘం నుండి 15వ ఆర్థిక సంఘం వరకు తలసరి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ)పై పోల్చదగిన డేటాను పరిగణనలోకి తీసుకున్నప్పుడు రాష్ట్రాల్లో అసమా నతలు విస్తృతమవుతున్నాయి. రాష్ట్రాల వ్యాప్తంగా ‘కోఎఫిషియెంట్‌ ఆఫ్‌ వేరియేషన్స్’ 0.46 నుండి 0.67కి పెరిగింది. తలసరి జీఎస్‌డీపీలో అసమానతలు 15వ కమిషన్స్ నివేదికలో ఇచ్చిన డేటాలో అత్యధికంగా ఉన్నాయి. కాబట్టి, రాష్ట్ర స్థాయిలో ఆదాయంలో విస్తరిస్తున్న అసమాన తలను 16వ కమిషన్స్ పరిగణనలోకి తీసుకోవాలి.

రాష్ట్రాలన్నింటిలోనూ, క్షితిజ సమాంతర పంపిణీ అనేది జనాభా, ప్రాంతం, తలసరి ఆదాయం వంటి సూచికలపైనా, జనాభా మార్పు, అటవీ విస్తీర్ణం వంటి ప్రోత్సాహక సంబంధిత సూచికలపైనా ఆధారపడి ఉంటుంది. రాష్ట్రాలన్నింటిలోనూ ఆదాయ అసమానత లను పరిష్కరించడానికి తలసరి ఆదాయంలో అంతరం అత్యంత ముఖ్యమైన సూచిక. 15వ కమిషన్స్లో ఆదాయ అంతరం 45 శాతం. ఆదాయ అంతరం వెనుక ఉన్న ముఖ్యమైన ఆలోచన ఏమిటంటే, రాష్ట్రాల మధ్య ఆర్థిక సామర్థ్య వ్యత్యాసాలు అనేవి పౌరులకు ఆరోగ్యం, విద్య, నీరు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సేవలను పొందడానికి ఆటంకం కాకూడదు.

ఇప్పటికీ దిగువే...
ఫైనాన్స్‌ కమిషన్స్ నివేదికల్లోని పోల్చదగిన గణాంకాలను బట్టి, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాలు తక్కువ ర్యాంకులో ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా వీటిలో పెద్ద మార్పు లేదు. కనిష్ఠ తలసరి జీఎస్‌డీపీ (బిహార్‌కి చెందినది) మరియు గరిష్ఠ తలసరి జీఎస్‌డీపీ నిష్పత్తి (ఇది గోవాను మినహాయించిన తర్వాత, పంజాబ్‌ లేదా హరియాణాను సూచిస్తుంది) 1999–2002 లోని త్రైవార్షిక సగటు 23.3 శాతం నుండి 2016–2019లో 17.7 శాతానికి తగ్గింది. బహుమితీయ పేదరికంపై నీతి అయోగ్‌ ఇటీవలి నివేదిక ప్రకారం చూసినప్పుడు, అఖిల భారత పేదరికం నిష్పత్తి అయిన 15 శాతంతో పోలిస్తే బిహార్‌లో అత్యధిక పేదరికం (33.76 శాతం) ఉంది. తర్వాతి స్థానాల్లో జార్ఖండ్‌ (28.81), యూపీ (22.93), మధ్యప్రదేశ్‌ (20.63), అస్సాం (19.35) ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో, 16వ కమిషన్స్ సిఫార్సులు అసమానతలను తగ్గించడంలో, ప్రత్యేకించి ఆదాయం విషయంలో ముఖ్యమైనవి. క్షితిజ సమాంతర పంపిణీ అనేది రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశం. అధిక పనితీరు కనబరుస్తున్న దక్షిణాది రాష్ట్రాలు, కాలక్రమేణా తమ వాటా తగ్గుముఖం పట్టిందనీ, ఆదాయం, జనాభా స్థిరీకరణ, మానవాభివృద్ధిలో మెరుగైన పనితీరు కారణంగా తమను దండి స్తున్నారనీ ఫిర్యాదు చేస్తున్నాయి. పన్నుల పంపిణీకి సమాంతర పంపిణీ సూత్రంతో ముడిపెట్టకూడదని ఒక సూచన. తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు గ్రాంట్లు అందించవచ్చు. కానీ పన్నుల పంపిణీ అనేది మొత్తం బదిలీలలో 80 శాతంగా ఉన్నట్లయితే ప్రగతిశీలంగా ఉంటుందనీ, గ్రాంట్లు (మొత్తం బదిలీలలో 20 శాతం)గా ఉన్నట్ల యితే తిరోగమన శీలంగా ఉంటుందనీ అనుభవం సూచిస్తోంది.

అందువల్ల, తక్కువ తలసరి ఆదాయ రాష్ట్రాలకు సహాయం చేయడా నికి గ్రాంట్లు మరింత ప్రగతిశీలంగా ఉండాలి. సాధారణంగా, అంత ర్రాష్ట్ర అసమానతలను పరిష్కరించే ఏకైక సంస్థ అయినందున, ఫైనాన్స్ ్స కమిషన్స్ పన్నుల పంపిణీ, గ్రాంట్లు రెండింటిలోనూ సమధర్మ సూత్రానికి మరింత సున్నితంగా ఉండాలి.

రాష్ట్రాలే ప్రగతికి కీలకం
16వ ఆర్థిక సంఘం పరిశీలించాల్సిన ఇతర అంశాలు: సంక్షో భాన్ని ఎదుర్కోవడానికి మరిన్ని ప్రోత్సాహకాలు, మానవాభివృద్ధిని మెరుగుపరచడం, రెవెన్యూ లోటు గ్రాంట్ల పరిశీలన, స్థానిక సంస్థలకు నిధుల బదిలీ, కేంద్రం, రాష్ట్రాలు రెండూ అందిస్తున్న ఉచితాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్‌) పునరుద్ధరణ. సీఎస్‌ఎస్‌ విషయానికొస్తే, రాష్ట్రాలు మరింత సరళతతో పథకాల రూపకల్పనలో పాల్గొనవచ్చు. ఆదాయ వ్యయాల శాతంగా ఉచితాలపై కొంత పరి మితి ఉండాలి. ఉచితాలపై సిఫార్సులు కేంద్రం, రాష్ట్రాలు రెండింటికీ వర్తిస్తాయి. ఆర్థిక నియమాల ఆధారంగా రుణాన్ని, ఆర్థిక స్థిరత్వ విశ్లేష ణను అందించడానికి స్వతంత్ర ఆర్థిక మండలిని ఏర్పాటు చేయాలనే సూచనలు కూడా ఉన్నాయి.

చివరగా, సమ్మిళిత అభివృద్ధితో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశ హోదాను సాధించాలని భారతదేశం ఆకాంక్షిస్తోంది. ఈ లక్ష్యా లను సాధించడంలో రాష్ట్రాల పాత్ర సమానంగా లేదా అంతకంటే ముఖ్యమైనది. రాష్ట్రాలు మొత్తం ప్రభుత్వ వ్యయంలో 60 శాతం ఖర్చు చేస్తాయి. విద్య, ఆరోగ్య వ్యయంలో 70 శాతం, మూలధన వ్యయంలో మూడింట రెండు వంతులు ఖర్చు చేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులలో 79 శాతం మందిని రాష్ట్రాలు నియమిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, అంతర్రాష్ట్ర అసమానతలను తగ్గించడంలో 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు ముఖ్యమైనవి.
ఎస్‌. మహేంద్ర దేవ్‌ 
వ్యాసకర్త హైదరాబాద్‌ ‘ఇక్ఫాయ్‌’లో విశిష్ట ప్రొఫెసర్‌
(‘ది హిందుస్థాన్స్ టైమ్స్‌’ సౌజన్యంతో)

>
మరిన్ని వార్తలు