RBI: అలాంటి వాటిని నమ్మొద్దు.. వెంటనే ఫిర్యాదు చేయండి - ఆర్‌బీఐ

11 Dec, 2023 19:46 IST|Sakshi

రుణమాఫీకి సంబంధించిన వార్తలు, సోషల్ మీడియాలో వస్తున్న మోసపూరిత ప్రకటనలను నమ్మకూడదని, వీటి వల్ల వినియోగదారులు మోసపోయే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ రోజు ఒక (డిసెంబర్ 11) ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కొన్ని సంస్థలు ఎటువంటి చట్టబద్ధమైన అధికారం లేకుండా 'రుణ మాఫీ సర్టిఫికెట్లు' జారీ చేయడానికి సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన సెంట్రల్ బ్యాంక్ ఈ ప్రకటన చేసింది. లోన్ తీసుకుంటే అవన్నీ మాఫీ అవుతాయనే వార్త వాస్తవం కాదని, వాటిని ఎట్టిపరిస్థితుల్లో నమ్మవద్దని ఆర్‌బీఐ వినియోగదారులను హెచ్చరించింది.

ప్రజలను మోసం చేయడానికి కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు ఇలాంటి మోసపూరిత ప్రకటనలు చేస్తున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇలాంటి మోసాలకు చెక్ పెట్టడానికి కొన్ని చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.

లోన్ తీసుకుని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని వస్తున్న వార్తలు ఆర్ధిక సంస్థల స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని, ముఖ్యంగా డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తాయని ఆర్‌బీఐ పేర్కొంది. ఇలాంటి సందేశాలు మీకు వచ్చినట్లయితే తప్పకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు