10వేల ఇళ్లు

23 Mar, 2023 01:36 IST|Sakshi
ప్రారంభానికి సిద్ధమైన గృహం
ఏప్రిల్‌ మొదటి వారంలో ‘జగనన్న’ గృహ ప్రవేశాలు
తుదిమెరుగులు దిద్దుకుంటున్న పేదల ఇళ్లు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి.. ఇప్పటికే జగనన్న కాలనీల్లో మౌలిక సౌకర్యాలైన తాగునీరు, విద్యుత్‌, మెరక, రోడ్లు, కాలువల నిర్మాణం తదితరాలన్నీ దాదాపుగా పూర్తవగా, లబ్ధిదారులు సైతం ప్రభుత్వం అందించిన ఆర్థికసాయంతో వేగంగా గృహాలు నిర్మించుకున్నారు. వచ్చే నెల మొదటివారం కల్లా జిల్లాలో పదివేల గృహాలు పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
– సాక్షి ప్రతినిధి, గుంటూరు

చ్చే నెల మొదటి వారానికి గుంటూరు జిల్లాలో పదివేల జగనన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దిశగా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా పేదలకు 67,678 ఇళ్లు కేటాయించింది. తర్వాత 90 రోజుల్లో ఇళ్ల పట్టాల కింద మరో 3,190 మందికి స్థలాలను ఇచ్చిన సంగతి తెలిసిందే.

● ఇప్పటి వరకు 65,719 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా, 7,384 ఇళ్లు పూర్తి చేశారు. మరో 684 ఇళ్లు శ్లాబ్‌ పనులు పూర్తి చేసుకున్నాయి.

● వచ్చే నెల మొదటి వారానికి పది వేల ఇళ్లు పూర్తయి గృహప్రవేశాలు చేసేలా అఽధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

● 1565 ఇళ్లు రూఫ్‌లెవల్‌కు చేరుకోగా, బేస్‌మెంట్‌ లెవల్‌ దాటిన ఇళ్లు సుమారు 32,742 వరకూ ఉన్నాయి. మరో 32,977 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవల్‌ కన్నా తక్కువలో ఉన్నాయి.

● ముఖ్యంగా గుంటూరు చుట్టుపక్కల ఉన్న లే–అవుట్లలో ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టర్లకు ఆప్షన్‌–3 కింద అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ పను లు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టారు.

● గుంటూరు నగరం పరిధిలో 27,318 ఇళ్లు ఉండగా, అందులో 14,850 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవల్‌ దాటాయి. ప్రధానంగా ఫిరంగిపురం మండలంలో 1076, చేబ్రోలులో 1264, తెనాలి అర్బన్‌లో 4459, తాడికొండలో 1055, కొల్లిపరలో 1224, దుగ్గిరాలలో 1048, మేడికొండూరులో 1133, తెనాలి రూరల్‌లో 1296 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవల్‌కి పైగా నిర్మాణంలోకి వచ్చాయి.

● పూర్తయిన ఇళ్లలో కూడా తెనాలి అర్బన్‌, తెనాలి రూరల్‌ ముందంజలో ఉన్నాయి.

● వేసవి ప్రారంభం కావడంతో ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్‌ వరకు వర్షాలు కురవడం, తాజాగా మూడు రోజుల పాటు వర్షాలు కురవడం కూడా కొంత జాప్యానికి కారణంగా మారింది.

● ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేసరికి తాగునీరు, విద్యుత్‌ సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. పూర్తయిన ఇళ్లకు ఎప్పటికప్పుడు బిల్లులు పూర్తిస్థాయిలో చెల్లిస్తున్నారు.

● జగనన్న కాలనీల లే–అవుట్లు మెరక చేయడం కోసం ఈ ఏడాది రూ.32కోట్లు చెల్లించారు. లక్ష్యాన్ని అందుకునేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టి పెడుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు.

అప్పటికి పదివేల గృహాలు పూర్తిచేయడమే లక్ష్యం ఇప్పటి వరకు పూర్తయిన ఇళ్లు 7,384...శ్లాబ్‌ దశలో 684 జగనన్న కాలనీలో పూర్తయిన ఇళ్లకు తాగునీరు, విద్యుత్‌ సదుపాయం అయిన పనులకు వెంటనే బిల్లులు చెల్లింపు లక్ష్యాన్ని చేరుకుంటాం : జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి

మరిన్ని వార్తలు