సామాజిక సమరోత్సాహం

16 Nov, 2023 01:48 IST|Sakshi

యాత్ర సాగిందిలా...

● మంత్రి జోగి రమేష్‌ కాసేపు ఎడ్లబండి నడిపి సందడి చేశారు.

● గౌడ కులస్తులు ట్రాక్టర్‌పై తాటి చెట్టు, తాటికుండలతో ర్యాలీలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

● క్రేన్‌ ద్వారా భారీ గజమాలతో ర్యాలీలో పాల్గొన్న అతిథులను సత్కరించారు.

● బహిరంగ సభలో ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ సీఎం జగన్‌, ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అంటే ఎంతమందికి ఇష్టమో చేతులెత్తమని అనడంతో ఒక్కసారిగా ప్రాంగణంలో ఉన్న ప్రజలంతా చేతులెత్తి జై కొట్టారు.

● సినీనటుడు ఆలీ ప్రసంగం మొదలుపెట్టగానే ప్రజలు హర్షధ్వానాలు చేశారు.

● పొన్నూరు నియోజకవర్గంపై రూపొందించిన ప్రత్యేక సీడీని ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ ఆవిష్కరించారు.

● ఐలాండ్‌ సెంటర్లో ఏకలవ్య కమిటీ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఏకలవ్య విగ్రహాన్ని, ఎమ్మెల్యే రోశయ్య ఆవిష్కరించారు.

పొన్నూరు, పట్నంబజార్‌: వైఎస్సార్‌ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర పొన్నూరులో విజయవంతమైంది. పట్టణం జనసంద్రమైంది. వైఎస్సార్‌ సీపీ కార్యాలయం నుంచి ఐలాండ్‌ సెంటర్‌ వరకు సాగిన యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేశారు. కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. బాణసంచా వెలుగులు మిరుమిట్లుగొలిపాయి. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అధ్యక్షతన జరిగిన యాత్ర దిగ్విజయంగా ముగిసింది. యాత్రలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, నందిగం సురేష్‌, వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ మర్రి రాజశేఖర్‌, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్‌, ఎమ్మెల్యేలు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, ఎమ్మెల్సీలు కుంభా రవి, పోతుల సునీత, ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా అడ్వయిజర్‌ ఆలీ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మందపాటి శేషగిరిరావు, నియోజకవర్గ పరిశీలకులు అంజిరెడ్డి, అన్నా బత్తుని సదాశివరావు, రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ సభ్యుడు షేక్‌ సైఫు ల్లా, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షులు పెరికల కృష్ణ మోహన్‌, పెదకాకాని మండలం జెడ్పీటీసీ గోళ్ళ జ్యోతి, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ నాయకులు, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ ఆకుల వెంకటేశ్వరరావు, ఎంఏ మహమ్మద్‌, షేక్‌ మాము, దాసరి నారాయణరావు, ఎందేటి వెంకటసుబ్బయ్య, సయ్యద్‌ సుభాని, షేక్‌ సుభాని, షేక్‌ జానీ భాష, మూకిరి అనిలా పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ ఆశయాలు జగన్‌తోనే సాకారం

రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ చంద్రబాబు, ఆయన ఉత్త పుత్రుడు లోకేష్‌, దత్త పుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయాలు సీఎం జగన్‌తోనే సాకారమవుతాయని వెల్లడించారు. మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ ప్రజలందరి ఆశీస్సులతో మరోమారు వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. నందిగం సురేష్‌, ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా అడ్వయిజర్‌, సినీ నటుడు ఆలీ మాట్లాడుతూ సామాజిక న్యాయం వైఎస్సార్‌ సీపీతోనే సాధ్యమన్నారు.

పొన్నూరులో బాగుపడింది నరేంద్ర కుటుంబమే : కిలారి రోశయ్య

ఎమ్మెల్యే కిలారి రోశయ్య మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర 25 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా చేసి బహుజనులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఆయన కుటుంబం మాత్రమే బాగుపడిందని ధ్వజమెత్తారు. తాను ఎమ్మెల్యే అయిన తరువాత చేసిన అభివృద్ధిని ప్రజలు చూడాలని కోరారు. ఐలాండ్‌ సెంటర్‌కు అంబేడ్కర్‌ సెంటర్‌గా పేరు మార్చేందుకు ప్రతిపాదనలు పంపామని వివరించారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాల ద్వారా రూ.1,524 కోట్ల లబ్ధి చేకూర్చామన్నారు. సామాజిక న్యాయం జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యపడుతోందని స్పష్టం చేశారు.

మార్మోగిన జగన్నినాదం

సాధికార బస్సు యాత్ర విజయవంతం భారీగా తరలి వచ్చిన ప్రజలు పొన్నూరు ఐలాండ్‌ సెంటర్‌ జనసంద్రం అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

ఎడ్లబండిని నడిపిస్తున్న మంత్రి జోగి రమేష్‌. వెనుక భారీగా తరలివస్తున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

మహానేత వైఎస్సార్‌ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రులు జోగి రమేష్‌, వేణుగోపాలకృష్ణ తదితరులు

మరిన్ని వార్తలు