ఎన్జీ రంగా వర్సిటీని సందర్శించిన మలేషియా వర్సిటీ బృందం | Sakshi
Sakshi News home page

ఎన్జీ రంగా వర్సిటీని సందర్శించిన మలేషియా వర్సిటీ బృందం

Published Wed, Nov 15 2023 12:54 AM

వీసీ డాక్టర్‌ శారద జయలక్ష్మీదేవి, అధికారులతో మలేషియా యూనివర్సిటీ ప్రతినిధుల బృందం - Sakshi

గుంటూరు రూరల్‌: మలేషియా, ఇండియాల మధ్య పరస్పర విద్యా మార్పిడి, తదితర విషయాలపై కూలంకుషంగా చర్చించి ఒక అవగాహనకు వచ్చేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ మలేషియా ప్రతినిధుల బృందం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిందని విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ ఆర్‌.శారదజయలక్ష్మీ దేవి తెలిపారు. మంగళవారం మలేషియా యూనివర్సిటీకి చెందిన ప్రతినిధులు డాక్టర్‌ మహమ్మద్‌ ఆరిఫుల్లా, డాక్టర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ కరీమ్‌లు విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలు, విద్యార్థులతో ఇంట్రాక్షన్‌, విద్యా అభివృద్ధి విషయాలపై వీసీ, యూనివర్సిటీ అధికారులతో చర్చించారు. బాపట్లలోని వ్యవసాయ కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఇరుదేశాలు విద్యా సంబంధమైన విషయాలపై పరస్పర సహకారానికి విశ్వవిద్యాలయం అధికారులతో అవగాహన కుదుర్చుకున్నారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.రామారావు, అగ్రికల్చర్‌ డీన్‌ డాక్టర్‌ జి.కరుణాసాగర్‌, రీసెర్చ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎల్‌.ప్రశాంతి, ఎక్స్‌టెన్షన్‌ౖ డెరెక్టర్‌ డాక్టర్‌ ఎ.సుబ్బరామిరెడ్డి, కంట్రోలర్‌ ఆర్‌ ఎగ్జామినేషన్‌ డాక్టర్‌ పి.సుధాకర్‌, స్టూడెంట్స్‌ అఫైర్స్‌ డీన్‌ డాక్టర్‌ పి.సాంబశివరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement