కేఎల్‌యూలో వాలీబాల్‌ పోటీలు ప్రారంభం

15 Nov, 2023 00:58 IST|Sakshi
పోటీలను ప్రారంభిస్తున్న త్రిదండి అహోబిల రామానుజ స్వామి

తాడేపల్లిరూరల్‌: తాడేపల్లి రూరల్‌పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్‌ విశ్వవిద్యాలయంలో మంగళవారం వాలీబాల్‌ (పురుషుల) పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా క్రీడల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ కె.హరికిషోర్‌ మాట్లాడుతూ జై శ్రీమన్నారాయణ, వీఆర్‌ యూత్‌ క్లబ్‌, కేఎల్‌ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పురుషుల విభాగం ప్రారంభోత్సవాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ స్వామి లాంఛనంగా ప్రారంభించారని తెలిపారు. క్రీడలు విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కోవడం నేర్పుతాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 విశ్వవిద్యాలయాలు, ఆయా ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి మొత్తం 14 టీమ్‌లు పాల్గొన్నాయన్నారు. అన్ని జట్లు రెండు రౌండ్‌లను పూర్తిచేసుకోగా, సెమీ ఫైనల్‌కు 4 జట్లు సిద్ధమయ్యాయన్నారు. వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ జి.పార్ధసారథి వర్మ, ప్రొ.వైస్‌ చాన్స్‌లర్లు డాక్టర్‌ ఏవీఎస్‌ ప్రసాద్‌, డాక్టర్‌ ఎన్‌.వెంకటరామ్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.సుబ్బారావు, విద్యార్ధి సంక్షేమ విభాగాధిపతి డాక్టర్‌ చప్పిడి హనుమంతరావు, వ్యాయామ అధ్యాపకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు