గుంటూరు

17 Nov, 2023 01:40 IST|Sakshi
శుక్రవారం శ్రీ 17 శ్రీ నవంబర్‌ శ్రీ 2023

7

త్రికోటేశ్వర దివ్య నామావళి

నరసరావుపేట: శ్రీ మేధా దక్షిణామూర్తి భక్త సమాజం, శ్రీ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు పొన్నపాటి ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కోటప్పకొండలో త్రికోటేశ్వరస్వామి వారి దివ్య నామావళి ఆడియోను ఎమ్మెల్యే గోపిరెడ్డి గురువారం విడుదల చేశారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం గురువారం 524.60 అడుగుల వద్ద ఉంది. ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి 27,538 క్యూసెక్కులు వదిలారు.

సత్రశాలకు పోటెత్తిన భక్తులు

రెంటచింతల: కార్తికమాసం సందర్భంగా సత్రశాల గంగా భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి గుడికి గురువారం భక్తులు భారీగా తరలివచ్చారు.

చిలకలూరిపేట: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం చిలకలూరిపేటలో సాక్షాత్కారం కానుంది. మూడూ నామాల స్వామి కనుల పండువగా కొలువుదీరనున్నాడు. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజల కలగా మిగిలిన తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపమూ నిర్మాణం జరుపుకోనుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని కృషి, దాతృత్వంతో ఈ పుణ్యకార్యం రూపుదాల్చనుంది. గతంలోనూ పలుమార్లు చిలకలూరిపేటలో టీటీడీ కల్యాణమండపం, ఆలయ నిర్మాణానికి ఆలోచనలు జరిగినా అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో పట్టువదలకుండా మంత్రి విడదల రజిని కృషి చేశారు. ఎట్టకేలకు ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ ఉత్తర్వులు సాధించిన ఘనతను సొంతం చేసుకున్నారు.

భూమి కేటాయింపు

తలచినదే తడువుగా చిలకలూరిపేటలో టీటీడీ కల్యాణ మండపం, శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించేందుకు అనువైన స్థలం కోసం మంత్రి విడదల రజిని అన్వేషణ సాగించారు. ఇందులో భాగంగా చిలకలూరిపేట పట్టణ పరిధిలోని పురుషోత్తమపట్నం వద్ద బైపాస్‌ రోడ్డు నిర్మాణం జరుపుకుంటున్న ప్రదేశానికి సమీపంలో భూమిని గుర్తించారు. బాపట్ల జిల్లా చీరాల ఓడరేవులోని శ్రీ కోదండరామస్వామి ఆలయానికి సంబంధించిన దేవదాయశాఖ భూమి పురుషోత్తమపట్నం సర్వే నంబర్‌ 336/1–సీ, 336/3సీలో ఉన్న ఐదు ఎకరాల భూమిని ఎంపిక చేశారు. ఈ భూమిలో కల్యాణ మండపం, ఆలయం నిర్మించేందుకు అవసరమైన ఫైళ్లను వేగంగా ముందుకు తెచ్చారు. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్‌ 21న దేవదాయశాఖకు చెందిన ఈ భూమిని కల్యాణ మండపం, వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించేందుకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అధికారులతో చర్చిస్తున్న మంత్రి విడదల రజిని

వేగంగా నిర్మాణపనులు

ఎన్నో దశాబ్దాలుగా కలగానే మిగిలి ఉన్న టీటీడీ కల్యాణ మండపం, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులు నా హయాంలో ప్రారంభం కానుండటం అదృష్టంగా భావిస్తున్నా. దీనికి సంబంధించి భూమి కేటాయింపు, అన్ని అనుమతులూ ఇప్పటికే లభించాయి. ఇక పనులు ప్రారంభించటమే తరువాయి. ఎవరి వద్ద నుంచి ఏమీ ఆశించకుండా దాతల వాటా కూడా చెల్లించాం. నిర్మాణ పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేస్తాం.

– విడదల రజిని,

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపాన్ని రూ.2.50 కోట్లతో, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రూ.75 లక్షలతో నిర్మించేందుకు టీటీడీ అంగీకారం తెలిపింది. ఇందులో టీటీడీ నిబంధనల ప్రకారం ఐదో వంతు భాగం 20 శాతాన్ని పబ్లిక్‌ కాంట్రిబ్యూషన్‌ (దాతల వాటా) ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కల్యాణ మండప నిర్మాణానికి రూ. 2.50 కోట్లలో రూ.50 లక్షలు, దేవాలయ నిర్మాణానికి సంబంధించి రూ.75 లక్షలకుగాను రూ.18.75 లక్షలు దాతల వాటా కింద చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ మొత్తాన్ని మంత్రి విడదల రజిని, కుమారస్వామి దంపతులు భరించేందుకు ముందుకు వచ్చారు. కల్యాణ మండప నిర్మాణానికి రూ.50 లక్షలు, వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.18.75 లక్షల నిమిత్తం రెండు డిమాండ్‌ డ్రాఫ్ట్‌లను ఈనెల ఆరో తేదీన మంత్రి విడదల రజిని కుటుంబ సభ్యులు ఆమె మరిది విడదల గోపీనాథ్‌ ఆధ్వర్యంలో తిరుమలలో టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డిని కలిసి అందజేశారు. దీంతో మొత్తం రూ.3.25 కోట్లతో టీటీడీ కల్యాణ మండపం, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాలకు మార్గం సుగమమైంది.

న్యూస్‌రీల్‌

కౌండిన్య ఐఏఎస్‌ అకాడమీ ఆధ్వర్యంలో కోచింగ్‌

గుంటూరు మెడికల్‌: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహిస్తున్న గ్రూప్‌–2 ఉద్యోగాల పోటీ పరీక్షలకు కౌండిన్య ఐఏఎస్‌ అకాడమీ ఆధ్వర్యంలో కోచింగ్‌ తరగతులు ప్రారంభిస్తున్నట్లు కౌండిన్య ఐఏఎస్‌ అకాడమీ చైర్మన్‌ డాక్టర్‌ ఈవీ నారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్‌ 27న ఉద యం 10 గంటలకు పెదకాకాని మండలం, వెనిగండ్ల గ్రామం శివారులోని కౌండిన్యపురంలోని కౌండిన్య భవన్‌లో ఈ శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. తరగతులకు పక్కా ప్రణాళికతో సివిల్స్‌ కోచింగ్‌ నిపుణులు, కమర్షియల్‌ ట్యాక్స్‌ విశ్రాంత అడిషనల్‌ కమిషనర్‌ వై.సత్యనారాయణ అధ్యక్షత వహిస్తారని వెల్లడించారు. శిక్షణ తరగతులలో వివిధ రంగాలలో నిపుణులైన, అనుభవం ఉన్న ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు, ప్రొఫెసర్‌ ఎం.కోటేశ్వరరావు, సలీం ఖాన్‌, విల్సన్‌, మల్లేష్‌, మస్తాన్‌ తదితరులు పాల్గొంటారని వివరించారు. గ్రూప్‌–2 పోటీ పరీక్షలలో విజయం సాధించాలనే పట్టుదలతో యత్నించే విద్యార్థులు వివరాలకు 6303846696 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

20 నుంచి మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ

సాక్షి, అమరావతి: పట్టణ స్వయం సహాయక సంఘ సభ్యులకు సుస్థిర జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి గురువారం తెలిపారు. దీనిలో భాగంగానే ‘పట్టణ ప్రగతి యూనిట్లు’ పేరుతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. స్వయం ఉపాధిపై ఆసక్తి కలిగిన పట్టణ సమాఖ్యలోని మహిళలను గుర్తించి ఆరు విభాగాల్లో సంపూర్ణ శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. నాలుగు రోజుల పాటు నైపుణ్య, వ్యాపారాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు. ఈ నెల 20 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా 167 పట్టణ సమాఖ్యల నుంచి ఎంపిక చేసిన మహిళలకు గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్‌ వర్సిటీ ప్రాంగణంలో శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు