‘ఆకృతి’ సుధాకర్‌కు ఘన సన్మానం

1 Jan, 2024 05:12 IST|Sakshi
సుధాకర్‌ను సన్మానిస్తున్న వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తదితరులు

సుల్తాన్‌బజార్‌: అత్యున్నత ప్రమాణాలతో వైవిధ్యమైన కార్యక్రమాలను నిర్వహించే సంస్థ ఆకృతి అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. ఆదివారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో సాంస్కృతిక సంస్థ సుపథం ఆధ్వర్యంలో ‘ఆకృతి’ అధ్యక్షుడు సుధాకర్‌కు ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ విభిన్న రంగాల దిగ్గజ ప్రముఖులను సుధాకర్‌ సత్కరించారని గుర్తుచేశారు. సమాజంలో ఎక్కడ మంచి ఉంట్టుందో అక్కడ గుర్తింపు వస్తుందనే సిద్ధాంతాన్ని నమ్మి ఆకృతి సుధాకర్‌ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కాలువ సుజాత మాట్లాడుతూ ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కళాకారులు, కళారూపాలకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అనంతరం సుధాకర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అచ్యుత జగదీష్‌ చంద్ర, కొత్త వెంకటేశ్వరరావు, మోహన్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఓయూ జిల్లా పీజీ కాలేజీల పేర్లు మార్పు

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలోని వివిధ జిల్లా కేంద్రాలలో కొనసాగుతున్న ఐదు పీజీ కాలేజీల పేర్లను మార్చారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరిగినందున గతంలో ఉన్న జిల్లాలకు అదనంగా కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా పీజీ కేంద్రాల కాలేజీల పేర్లను పాలక మండలి సభ్యుల ఆమోదంతో మార్పు చేశారు. సిద్దిపేట పీజీ కాలేజీతో పాటు మీర్జాపూర్‌, జోగిపేట్‌, నర్సాపూర్‌, వికారాబాద్‌ పీజీ కాలేజీలను ఇక నుంచి యూనివర్సిటీ పీజీ కాలేజీలుగా వ్యవహరించనున్నట్లు ఓయూ అధికారులు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు