భారీ సంఖ్యలో లీకైన లింక్డ్‌ఇన్‌ యూజర్ల డేటా!

9 Apr, 2021 19:11 IST|Sakshi

కొద్ది రోజుల క్రితం 53.3 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల వ్యక్తిగత డేటా లీకైన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవక ముందే లింక్డ్‌ఇన్‌ యూజర్ల డేటా లీక్ అయింది. సైబర్‌న్యూస్ ప్రకారం.. 50 కోట్లకు  పైగా లింక్డ్ఇన్ వినియోగదారుల డేటా డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉన్నట్లు పేర్కొంది. లీక్ అయిన సమాచారంలో లింక్డ్ఇన్ ఐడి, పూర్తి పేర్లు, ఇమెయిల్ చిరునామాలు, ఫోన్ నంబర్లు, లింగాలు, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్, ఇతర కీలక వివరాలు ఉన్నాయి. ఈ మేరకు 50 కోట్ల మంది వివరాల్ని హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాడు దాన్ని ఓ వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంచినట్లు సైబర్‌న్యూస్‌ అనే వార్తా సంస్థ పేర్కొంది.

ఈ సమాచారాన్ని సదరు హ్యాకర్‌ కొన్ని వేల డాలర్లు విలువ చేసే బిట్‌కాయిన్లకు విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. లీకైన డేటా లింక్డ్‌ఇన్‌ యూజర్ల ఫొఫైళ్ల నుంచి హ్యాక్‌ చేసినవి కాదని లింక్డ్‌ఇన్ తెలిపింది. కొన్ని ఇతర వెబ్‌సైట్లు, కంపెనీల నుంచి సేకరించిన వివరాల సమాహారమని పేర్కొంది. దాదాపు 50 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారం ఆన్‌లైన్‌లో కనిపించడం ఇటీవల కలకలంరేపిన విషయం తెలిసిందే. 106 దేశాలకు చెందిన వినియోగదారుల ఫేస్‌బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, ప్రాంతాలు, పుట్టిన తేదీలు, ఈ-మెయిల్‌ ఐడీలు, చిరునామాలు అమ్మకానికి ఉంచారు

ఇటాలియన్ గోప్యతా వాచ్డాగ్ లింక్డ్ఇన్ మిలియన్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ఏవిదంగా బహిర్గతం అయ్యింది అనే దానిపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ డేటా ద్వారా స్పామ్ కాల్స్, స్పామ్ మెయిల్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు సైబర్ నిపుణులు పేర్కొన్నారు. అలాగే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి టూ-స్టెప్-వెరిఫికేషన్ ఆక్టివేట్ చేసుకోవాలని, అలాగే మీ లింక్డ్ఇన్ ఖాతా పాస్వర్డ్, లింక్డ్ఇన్ ఖాతాతో అనుబంధించబడిన ఈమెయిల్ చిరునామా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

చదవండి: గుప్త నిధులు దొరికితే.. అది ఎవరికి చెందుతుంది?

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు