పాక్‌ నేతల ఆడియో సంభాషణలు లీక్‌ కలకలం

26 Sep, 2022 05:15 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రభుత్వంలోని కీలక నేతల మధ్య సాగిన సంభాషణల ఆడియో క్లిప్పులు బయటకు రావడం కలకలం రేపుతోంది. అత్యంత భద్రత ఉండే ప్రధానమంత్రి కార్యాలయంలో అధికార పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌(నవాజ్‌) నేతల సంభాషణలు ఆ క్లిప్పుల్లో ఉండటం గమనార్హం.

అంతర్గత, రక్షణ, న్యాయ, ఆర్థిక శాఖల మంత్రులు రాణా సనాఉల్లా, ఖ్వాజా ఆసిఫ్, ఆజం తరార్, అయాజ్‌ సాదిఖ్‌లు గత తెహ్రీక్‌–ఇ–ఇన్సాఫ్‌ ప్రభుత్వం గద్దె దిగడంపై చేసిన వ్యాఖ్యలు అందులో ఉన్నాయి. మరో ఆడియో క్లిప్పులో, ఆర్థిక మంత్రి ఇస్మాయిల్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పీఎంఎల్‌–ఎన్‌ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్, ఆర్థిక మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ల మధ్య జరిగిన సంభాషణ ఉంది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించలేదు. ప్రతిపక్షాలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు