Brazil Plane Crash: బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి 

17 Sep, 2023 10:42 IST|Sakshi

రియో డి జెనారో: అమెజాన్ అడవుల్లో బార్సెలోస్‌ ప్రాంతానికి వెళ్తోన్న టూరిస్టు విమానం కుప్పకూలడంతో సిబ్బందితో కలిపి మొత్తం 14 మంది మృతి చెందారు. బ్రెజిల్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన అమెజాన్ అడవుల్లోని బార్సెలోస్‌ను సందర్శించేందుకు 14 మందితో కూడిన టూరిస్టు విమానం వాతావారణ పరిస్థితులు  అనుకూలించకపోవడంతో అడవుల్లో కుప్పకూలింది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 12 మంది పర్యాటకులతోపాటు ఇద్డరు సిబ్బంది కూడా మృతిచెందారు. 

భారీ వర్షంలో ప్రయాణిస్తున్న ఈ విమానం పైలట్ ఎదురుగా ఏమీ కలిపించకపోయిన అలాగే నడుపుకుంటూ వెళ్లారు. ఇదే క్రమంలో  ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించగా పరిస్థితులు అనుకూలించక విమానం అడవుల్లో కుప్పకూలిందని ఆమెజోనా స్టేట్ సెక్యూరిటీ సెక్రెటరీ వినిషియస్ అల్మెయిదా తెలిపారు. 

ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని మృతుల్లో స్పోర్ట్ ఫిషింగ్ నిమిత్తం బయలుదేరిన 12 మంది మగవారితో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నారని ఒక స్టేట్‌మెంట్‌లో తెలిపింది అక్కడి ప్రభుత్వం. మృతుల కుటుంబానికి స్నేహితులకు ప్రగాఢ సానుభూతులు తెలిపిన గవర్నర్ విల్సన్ లిమా ప్రమాదం గురించి తెలిసిన మరుక్షణం నుండి విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. 

మీడియా కథనాల ప్రకారం ప్రమాదానికి గురైన విమానం బ్రెజిలియన్ ఎయిర్‌క్రాఫ్ట్ మేకర్ ఎంబ్రేయర్ తయారు చేసిన ట్విన్-ఇంజన్ టర్బోప్రాప్ ఈఎంబీ-10 12 మంది టూరిస్టులతో మనౌస్ నుంచి బార్సెలోస్‌కు బయలుదేరింది.. మనౌస్ నుంచి బార్సెలోస్‌కు గంటన్నర ప్రయాణ సమయం పడుతుందని వాతావరణంసరిగ్గా లేనందునే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.  

ఇది కూడా చదవండి: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ఆగుతుందటే..

మరిన్ని వార్తలు