Sakshi News home page

విజేత మౌనిక అక్షయ.. కుశాగ్ర మోహన్‌కు రజతం

Published Sun, Sep 17 2023 10:34 AM

Asian Junior Chess Mounika Akshaya Won Gold Kushagra Mohan Silver - Sakshi

జంషెడ్‌పూర్‌: టాటా స్టీల్‌ ఆసియా జూనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ మహిళల బ్లిట్జ్‌ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మిని మౌనిక అక్షయ విజేతగా అవతరించింది. గుంటూరు జిల్లాకు చెందిన 20 ఏళ్ల మౌనిక అక్షయ నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత 7.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

మౌనిక అక్షయ ఏడు గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. భారత్‌కే చెందిన భాగ్యశ్రీ పాటిల్, బ్రిస్టీ ముఖర్జీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్య పతకాలను 
దక్కించుకున్నారు.  

కుశాగ్ర మోహన్‌కు రజతం 
బ్లిట్జ్‌ ఓపెన్‌ విభాగంలో తెలంగాణకు చెందిన కుశాగ్ర మోహన్‌ రజత పతకం సాధించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత అలెక్సీ గ్రెబనోవ్‌ (రష్యా), కుశాగ్ర మోహన్‌ 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా... గ్రెబనోవ్‌కు స్వర్ణం ఖరారైంది. కుశాగ్ర మోహన్‌కు రజతం లభించింది.

క్వార్టర్స్‌లో ఓడిన అభిమన్యు 
బెల్‌గ్రేడ్‌: ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు నలుగురు భారత రెజ్లర్లు నిరాశపరిచారు. ఆకాశ్‌ దహియా (61 కేజీలు) ప్రిక్వార్టర్‌ ఫైనల్లో, అభిమన్యు (70 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లో... సందీప్‌ మాన్‌ (86 కేజీలు) రెండో రౌండ్‌లో... సుమిత్‌ మలిక్‌ (125 కేజీలు) ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయారు.

ఒలింపిక్‌ వెయిట్‌ కేటగిరీల్లో  సందీప్, సుమిత్‌లపై నెగ్గిన రెజ్లర్లు ఫైనల్‌ చేరుకోకపోవడంతో భారత రెజ్లర్లకు ‘రెపిచాజ్‌’ రౌండ్‌లలో ఆడే అవకాశం కూడా రాలేదు. అభిమన్యు క్వార్టర్‌ ఫైనల్లో 2–9తో అలెన్‌ రూథర్‌ఫర్డ్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. అలెన్‌ ఫైనల్‌ చేరుకోవడంతో అభిమన్యుకు నేడు ‘రెపిచాజ్‌’ బౌట్‌లలో పోటీపడే అవకాశం లభించింది. 

adsolute_video_ad

Advertisement

What’s your opinion

Advertisement