పెళ్లిలో యువతుల జోరు.. బ్లాక్ డ్రెస్‌లో కుమ్మేశారు..!

5 Sep, 2023 11:40 IST|Sakshi

పెళ్లిలో వధువు లేదా వరుని స్నేహితుల డ్యాన్సులు చాలా ప్రత్యేకం. ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్పెషల్‌గా ప్లాన్ చేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఓ పెళ్లి వేడుకలో జరిగింది. స్నేహితురాల్ని సర్‌ప్రైజ్ చేస్తూ ప్రత్యేక దుస్తుల్లో చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

వధువు స్నేహితులు పెళ్లికి వెళ్లారు. ఆమెను సర్‌ప్రైజ్ చేయడానికి ప్రత్యేకమైన డ్యాన్సులు చేశారు. ప్రత్యేకమైన విషధారణతో వేడుకకు హాజరైన బంధుమిత్రులను ఆశ్చర్యానికి గురిచేశారు. నల్లని డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు, తెల్లని దుస్తులు ధరించిన అబ్బాయిలు కలిసి డ్యాన్సులతో అబ్బురపరిచారు. 

A post shared by Betty Who (@bettywho)

వేదికమీదకు ఎక్కి ఉత్తరకొరియాకు చెందిన పింక్ వీనోమ్ సాంగ్‌ని ప్లే చేశారు. ఆ ట్యూన్‌కు దగ్గట్టుగా మెలికలు తిరుగుతూ చిందులు వేశారు.  ఆ డ్యాన్సును వరునికి డిడికేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సదరు వధువు స్నేహితుల డ్యాన్సులు చూసిన నెటిజన్లు అద్భుతం అంటూ కామెంట్లు పెట్టారు. ఈ వీడియోను సంగీతకారుడు బెట్టీ హూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో అమెరికన్ గాయకుడు స్కాట్ హోయింగ్, కొరియోగ్రఫీ జంట ఆస్టిన్, మారిడెత్‌లను ట్యాగ్ చేశారు.

ఈ వీడియోకు ఒక్క రోజులోనే రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. వేదికపై డ్యాన్సులు చేసిన వారి వేషధారణ చాలా బాగుందని కొందరు నెటిజన్లు స్పందించారు. ప్రోఫెషనల్ డ్యాన్స్ అంటూ మరికొందరు కామెంట్ పెట్టారు. బ్లాక్ పింక్ డ్యాన్స్‌కు ఫిదా అయినట్లు స్పందించారు. 

ఇదీ చదవండి: బస్సులో సీటు కోసం మహిళ ఫీట్లు

మరిన్ని వార్తలు