వైరల్‌: పాములకు ఆశ్రయం కల్పిస్తోన్న బౌద్ధ సన్యాసి

4 Dec, 2020 16:28 IST|Sakshi

వన్యప్రాణులను అక్రమంగా విక్రయించడంలో మయన్మార్ ప్రపంచంలోనే కేంద్ర బిందువుగా మారింది. స్థానికంగా ఉండే పాములను పట్టుకొని తరచుగా పొరుగు దేశాలైన చైనా, థాయ్‌లాండ్‌కు అక్రమంగా రవాణా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మయన్మార్‌లోని యాంగోన్‌లో ఓ బౌద్ధ సన్యాసి వివిధ రకాల పాములకు ఆశ్రయం కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఓ ఆశ్రమాన్ని ఎంచుకొని కొన్ని వేల జాతుల పాములకు అక్కడ రక్షణ కల్పిస్తున్నారు. ఈ క్రమంలో పాములతో బౌద్ధ సన్యాసి దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. విలాతా(69) అనే బౌద్ధ సన్యాసి సీక్తా తుఖా టెటూ ఆశ్రమంలో కొండ చిలువ, త్రాచుపాము, వైపర్లు వంటి సరీసృపాలకు ఆశ్రయం కల్పించి వాటిని రక్షిస్తున్నారు. ఇలా పాములకు ఆశ్రయం కల్పించడం దాదాపు అయిదేళ్ల క్రితమే ప్రారంభమైంది. చదవండి: కుక్కపిల్ల కోసం కొండచిలువతో పోరాటం

ఈ మేరకు బౌద్ధ సన్యాసి మాట్లాడుతూ.. పాములను వ్యాపారంగా భావించి అ‍మ్మడం, చంపేయండం చూసి చలించిపోయిన తను వెంటనే వాటికి వ్యాపారుల నుంచి రక్షణ అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. స్థానికులుతోపాటు, ప్రభుత్వ సంస్థలు వివిధ చోట్ల బంధించిన పాములను సన్యాసి వద్దకు తీసుకువస్తారని ఆయన పేర్కొన్నారు. వాటి సంరక్షణ, బాగోగులు చూసి పాములు తిరిగి అడవికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు భావించే వరకు ఆశ్రయంలో ఉంచి వాటికి భ్రదత కల్పిస్తానని తెలిపారు. ఇటీవల విలాతా అనేక రకాల పాములను హ్లావ్గా నేషనల్ పార్క్‌లో విడిచి వచ్చినట్లు వెల్లడించారు. అలా పాములు స్వేచ్చగా అడవిలోకి వెళ్లడం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అయితే మళ్లీ వాటిని ప్రజలు పట్టుకొని అమ్మేందుకు ప్రయత్నిస్తే ఆందోళన చెందుతానని అన్నారు. కాగా సన్యాసి రక్షిస్తున్న పాములకు ఆహారం అందించేందుకు ఇవ్వడానికి సుమారు 300 డాలర్లు విరాళాలు అసవరం అవుతున్నాయని తెలిపారు. చదవండి: 37 ఏళ్లలో 37 సార్లు పాము కాటు!

మరిన్ని వార్తలు