చిలీ అధ్యక్షుడిగా గాబ్రియెల్‌

13 Mar, 2022 06:09 IST|Sakshi

శాంటియాగో: వామపక్ష భావజాలమున్న గాబ్రియెల్‌ బొరిక్‌ చిలీ కొత్త అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో ఆర్థిక అసమానతలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో 36 ఏళ్ల బొరిక్‌ రాకతో ప్రజల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి. ఆర్థికంగా సంపన్న దేశమైన చిలీలో అసమానతలు ఎక్కువగా ఉండడంతో తరచూ ఆందోళనలు జరుగుతుంటాయి.

పదిహేడేళ్ల పాటు మిలటరీ నియంతృత్వం రాజ్యమేలి, రక్తపాతం జరిగిన చిలీలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించి నాలుగేళ్లే అయింది. బొరిక్‌ తన కేబినెట్‌లో 14 మంది మహిళల్ని చేర్చుకొని తమది ఫెమినెస్ట్‌ కేబినెట్‌ అని చాటి చెప్పారు. మరో 10 మంది పురుషులు మంత్రులుగా ప్రమాణం చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో 56% ఓట్లతో కన్జర్వేటివ్‌ అయిన జాస్‌ ఆంటోనియా కాస్ట్‌పై గాబ్రియెల్‌ బొరిక్‌ విజయం సాధించారు.

మరిన్ని వార్తలు