చైనా అనుసరిస్తున్న కోవిడ్‌ విధానాన్ని నిందిస్తూ ... వార్‌ హీరో కూతురి లేఖ వైరల్‌

12 Jun, 2022 19:33 IST|Sakshi

Covid diagnosis and treatment plan is violated: కరోనా పుట్టినిల్లు అయినా చైనా ఆది నుంచి జీరో కోవిడ్‌ పాలసీ విధానం అంటూ గొప్పలు చెప్పుకుంది. ఎంత కఠినతరమైన ఆంక్షలు విధించినా కరోనా కేసులు పెరుగుతూ.. ఊహించని ఝలక్‌ ఇస్తూనే ఉంది ఈ కోవిడ్‌ మహమ్మారి. దీంతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ జీరో కోవిడ్‌ పాలసీ విధానాన్ని డబుల్‌ చేస్తానంటూ ప్రకటించాడు. వృద్ధులు, చిన్నారులు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఈ విధానం వద్దని చైనా అధికారులు చెబుతున్నా వినకుండా నియంతలా వ్యవహరించాడు జిన్‌పింగ్‌.

మరోవైపు ప్రపంచ దేశాల నుంచి కూడా చైనా పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి . ఈ నేపథ్యంలో చైనా యుద్ధ వీరుడు, జనరల్‌ లువో రుయికింగ్ కుమార్తె లువో డయాండియన్ కరోనా మహమ్మారి విషయంలో చైనా అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ రాసిన లేఖ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ లేఖలో ఆమె చైనా అధ్యక్షుడి పేరు ఎత్తకుండా ఆయన తీసుకుంటున్న నిర్ణయాల పై పరోక్షంగా ఆరోపణలు చేసింది. ఐసోలేషన్‌ అంటూ జనాలను బంధిస్తూ చైనా ప్రభుత్వం తనకు తెలియకుండానే కరోనా వచ్చిన వారిని, రానివారిని కూడా బంధీలుగా మార్చింది.

దీని వల్ల ప్రజల మానసిక స్థితి దెబ్బతింటుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేదంటూ తిట్టిపోసింది. బాధ్యతరాహిత్యంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తూ ఆరోగ్య కార్యకర్తలను అధికారులను ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించింది. ఇలాంటి విపత్కర సమయంలో పాటించాల్సిన కనీస ప్రాథమిక విధానాలను కూడా ఉల్లంఘించిందంటూ ఘాటు విమర్శలు చేసింది. ఇది  ప్రజల నిత్య జీవన విధానానికి విఘాతం కలిగించేలా తప్పుడూ విధానాన్ని అనుసరించిందని చెప్పింది. ఇంత అన్యాయం జరుగుతున్న అధికారంలో ఉన్నవారెవరు నోరెత్తకపోవడం విచిత్రం అంటూ చైనా తీరుని నిందిస్తూ రాసింది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: విజృంభిస్తున్న కేసులు... జీరో కోవిడ్‌ పాలసీని వదలనంటున్న చైనా!)

మరిన్ని వార్తలు