శిబిరంలో 50,000 మందికి నాలుగే టాయిలెట్లు... గాజాలో దుర్భర పరిస్థితులు

8 Nov, 2023 16:37 IST|Sakshi

న్యూయార్క్: గాజాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని అమెరికాకు చెందిన నర్సు ఎమిలీ కల్లాహన్ తెలిపింది. అక్కడ సురక్షితమైన ప్రదేశమంటూ లేదని వెల్లడించింది. యుద్ధభూమి నుంచి బయటపడి అమెరికాకు వెళ్లిన తర్వాత అక్కడ ఆమె చూసిన భయానక విషయాలను ఇంటర్వ్యూలో పంచుకుంది. 

గాజాలో 50,000 మంది ఒకే సహయక శిబిరంలో తలదాచుకున్నామని కల్లహన్ తెలిపింది. అక్కడ కేవలం నాలుగు టాయిలెట్స్ మాత్రమే ఉండగా.. కేవలం నాలుగు గంటలే నీరు అందుబాటులో ఉండేదని తాము అనుభవించిన దుర్భర పరిస్థితులను బయటపెట్టింది. అమెరికాకు చేరి తన కుటుంబాన్ని కలుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపిన ఎమిలీ కల్లాహన్..   గాజాలో గాయపడిన వారికి చికిత్స చేస్తున్న పాలస్తీనా డాక్టర్లు నిజమైన హీరోలని కొనియాడింది. 

"26 రోజుల్లో ఐదుసార్లు మకాం మారాల్సి వచ్చింది. కమ్యూనిస్టు ట్రైనింగ్ సెంటర్‌లో 35,000 మందిమి తలదాచుకున్నాం. అక్కడ కొంతమంది పిల్లలకు చర్మం కాలిపోయి ఉంది. ఆస్పత్రులు నిండిపోయాయి. బంధువులు కోల్పోయిన బాధలో డాక్టర్లపైనే బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నన్ను అమెరికన్ అని గుర్తిస్తూ అరబ్‌లా నటిస్తున్నావని అరిచారు. మా బృందాన్ని దేశద్రోహులుగా చిత్రిస్తున్నారు. పాలస్తీనా సిబ్బంది నిత్యం మా వెంటే ఉన్నారు. స్థానిక స్టాఫ్ మమ్మల్ని రక్షించకపోతే ఖచ్చితంగా చనిపోయేవాళ్లం." అని అక్కడి భయనక విషయాలను కల్లాహన్ బయటపెట్టారు.  

మా సిబ్బంది అక్కడి అధికారులతో మాట్లాడి రఫా సరిహద్దు గుండా ఈజిప్టుకు బస్సుల్లో తరలించారని కల్లాహన్ వెల్లడించింది. అక్కడ సిబ్బంది మాకోసం ఎంతో త్యాగం చేశారని ఆమె తెలిపారు. దేశం విడిచి రావడానికి అక్కడి సిబ్బంది అంగీకరించలేదని.. దేశం కోసం ప్రాణత్యాగం చేయడం కోసమే వారు ప్రధాన్యతనిచ్చారని తెలిపింది.    

ఇదీ చదవండి: Israel-Palestine War Updates: గాజాలో ఆగని వేట

మరిన్ని వార్తలు