వివాదాస్పద యూ ట్యూబర్‌ అనుమానాస్పద మృతి

12 Oct, 2023 18:05 IST|Sakshi

కొరియాకు చెందిన వివాదాస్పద యూ ట్యూబర్‌ , మాజీ ఎంటర్‌టైన్‌మెంట్  రిపోర్టర్‌,కిమ్ యోంగ్ హో అనుమానాస్పదంగా శవమై తేలాడు. కిమ్‌పై లైంగిక వేధింపుల కేసుతోపాటు అనేక క్రిమినల్‌ కేసులుకూడా ఉన్నట్టు తెలుస్తోంది. లైంగిక వేధింపుల కేసు విచారణలో భాగంగా బుసాన్‌లో ఉన్నాడు. మరణానికి ఒక రోజు ముందు విచారణ జరిగింది. ఈ కేసు తీర్పు నేపథ్యంలోనే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు.

2019, జూలైలో హేయుండే రెస్టారెంట్‌లో ఒక మహిళను లైంగికంగా వేధించిన కేసులో తాజాగా ఎనిమిది నెలల జైలు  శిక్ష, రెండేళ్లపాటు సస్పెన్షన్‌ కూడా ఖరారైంది.  ఈ తీర్పు వెలువడిన తరువాత బుసాన్‌లోని హాయుండే జిల్లాలోని హోటల్‌లోని నాల్గవ అంతస్తులోని హోటల్ చనిపోయి కన్పించాడు. మృతదేహాన్ని స్వాధీనంచేసుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.  ఆత్మహత్యే కావచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. 

కిమ్ యోంగ్ హోపై లంచం, బ్లాక్ మెయిల్అనేక అరోపణలున్నాయి.వాటిలో చాలా వరకు చట్టబద్ధంగా నిజమని నిరూపితమైనాయి కూడా. ప్రధానంగా సెలబ్రిటీలను రహస్యాలను బహిర్గతం చేస్తాననంబెదిరించడం, పెద్ద మొత్తంలో డబ్బు,లగ్జరీ బ్యాగులు డిమాండ్‌ చేయడంలాంటి ఆరోపణలు వచ్చాయి. అలాగే కిమ్ యోంగ్ హోపై ప్రముఖ కొరియన్ నటి హాన్ యే సీల్  కూడా కేసు పెట్టారు. చివరికి 2021లో   తన యూట్యూబ్ ఛానెల్‌ని  కూడా మూసివేశాడు.

నేనొక  రాక్షసుడ్ని
కాగా తన చానెల్‌ మూసివేత సందర్భంగా తన తప్పు ఒప్పుకుంటూ కన్నీటి పర్యంతయ్యాడు. తన మాటలతో మనుషులను పొడిచి చంపడం అలవాటు అయి పోయిందనీ, చాలామంది సబ్‌స్క్రైబర్లు, వ్యూస్‌ రావడంతో క్రూరంగా, ఒక రాక్షసుడిగా మార్చేసింది అంటూ ప్రకటించాడు. ఎవరి బలవంతం మీద తానీ పనిచేయడం లేదనీ, సిగ్గుతో శాశ్వతంగా ఈ ప్లాట్‌ఫారమ్‌నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు