900 ఏళ్లకు  నిద్రలేచి.. వణికించి.. భయపెట్టి

24 Mar, 2021 08:08 IST|Sakshi

వరుసగా భూకంపాలు.. రాత్రిలేదు, పగలు లేదు.. ప్రతి నిమిషం వణుకే.. ప్రతి క్షణం భయం భయమే. ఒకటీ రెండూ కాదు.. కేవలం మూడు వారాల్లో ఏకంగా 50 వేల ప్రకంపనలు. ఓ రోజు ఉన్నట్టుండి ఆగిపోయాయ్‌. హమ్మయ్య అనుకోవడానికి లేదు. భూకంపాలు ఆగిపోగానే.. అగ్ని పర్వతం పేలడం మొదలైంది. కుతకుతా ఉడుకుతున్న ఎర్రని లావా పెల్లుబుకుతూ ప్రవహిస్తోంది. అటు యూరప్‌.. ఇటు అమెరికా ఖండాల మధ్య అట్లాంటిక్‌ మహా సముద్రంలో ఉన్న ఐస్‌ల్యాండ్‌లో కొద్దిరోజులుగా పరిస్థితి ఇది. ఇక్కడ 900 ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న ఫగ్రడాల్స్‌జల్‌ అగి్నపర్వతం తాజాగా బద్దలైంది.

సుమారు కిలోమీటరు వెడల్పుతో లావా ఓ నదిలా ప్రవహిస్తోంది. కొందరు ఫొటోగ్రాఫర్లు ఓ డ్రోన్‌ సాయంతో అగ్ని పర్వతం పేలుడును చిత్రీకరించారు. ఓ వైపు మంచు గ్లేసియర్లు, వేడి నీటి ఊటలు, మరోవైపు ఎటు చూసినా పచ్చదనంతో ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన ఐస్‌ల్యాండ్‌లో.. ఏకంగా 32 అగి్నపర్వతాలు ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు