Evening Top 10 News: ఈవెనింగ్‌ టాప్‌ 10 తెలుగు న్యూస్‌

18 Jul, 2022 17:57 IST|Sakshi

1. ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై సీఎం జగన్‌ సమీక్ష
‘గడప గడపకు మన ప్రభుత్వం’పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి రిజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు హాజరయ్యారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. చంద్రబాబు చీప్ పాలిటిక్స్: మంత్రి కారుమూరి
గోదావరికి ఎన్నడూ లేనంతగా ఉధృతంగా వరదలు వచ్చాయని.. ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరదలపై అధికారులను అలర్ట్‌ చేశారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. 48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి: సీఎం జగన్‌
రాష్ట్రంలో వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. సోమవారం ఉదయం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వరద ప్రభావిత ఆరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన లారీ
కామారెడ్డి జిల్లాలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మద్నూర్‌ మండల సమీపంలోని మేనూర్‌ హైవేపై ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. కాంగ్రెస్‌కు షాకిచ్చిన సీతక్క.. పొరపాటున ద్రౌపది ముర్ముకు ఓటు
దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఓటు వేసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. డెలివరీ బాయ్‌ కాదు హీరో.. ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న ఫ్యామిలీని బయటకు
అర్ధరాత్రి మంటల్లో కాలిపోతున్న ఇంట్లోకి ప్రాణాలకు తెగించి వెళ్లాడు ఓ పిజ్జా డెలివరీ బాయ్. అందులో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా కాపాడాడు. ఈ క్రమంలో అద్దాలు పగలగొట్టి మరీ మొదటి అంతస్తు నుంచి దూకి చేతికి గాయం చేసుకున్నాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అనూహ్య నిర్ణయం!
ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టుకు భారీ కుదుపు! స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అనూహ్యంగా వన్డేల నుంచి తప్పుకున్నాడు. తాను వన్డే ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్టు స్టోక్స్‌ సోమవారం ప్రకటించాడు. దక్షిణాప్రికాతో డర్హమ్‌లో మంగళవారం జరిగే వన్డే మ్యాచ్‌ తన చివరిదని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. తెలుగు ప్రేక్షకులపై దిల్‌ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు..
టాలీవుడ్‌లో సినిమా షూటింగ్స్‌ బంద్‌పై అగ్ర నిర్మాత దిల్‌ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొడక్షన్‌ వ్యయం తగ్గించే విషయమై నిర్మాతలు అందరూ కూర్చొని చర్చించామని ఆయన తెలిపారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. 8 యాప్‌లను డిలీట్‌ చేసిన గూగుల్‌.. మీరు చేయకపోతే డేంజరే!
ప్రస్తుత 4జీ కాలంలో ప్రతి ఒక్కరి జేబులో స్మార్ట్‌ఫోన్‌ ఉంటోంది. టెక్నాలజీ పుణ్యమా అని మనకు కావాల్సినవన్నీ మొబైల్‌లోనే ప్రత్యక్షమవుతన్నాయి. అయితే దీంతో పాటే కొన్ని సార్లు వైరస్‌, హాకర్ల రూపంలో ప్రమాదాలు వస్తుంటాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఈ హీరోయిన్‌ ధరించిన డ్రెస్‌ ధర 45వేల పైమాటే! ప్రత్యేకత ఏమిటంటే!
ఆవకాయ బిర్యానీ గుర్తుంది కదా.. వంటకం కాదండీ.. రెస్టారెంట్‌ పేరు అంతకన్నా కాదు. అచ్చతెలుగు హీరోయిన్‌.. మదనపల్లె మగువ.. బిందు మాధవి. గ్లామర్‌తో వెండి తెర మీదే కాదు తనదైన సిగ్నేచర్‌ స్టయిల్‌తో ఫ్యాషన్‌ వరల్డ్‌లోనూ మెరిసిపోతోంది ఇలా
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు