ఆత్మహత్యకు రెడీ అయిన మహిళ.. పోలీసు తెలివికి ఫిదా.. వీడియో వైరల్‌

16 Oct, 2022 13:55 IST|Sakshi

ఆమెకు ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు గానీ.. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైంది. ఆత్మహత్య చేసుకోవడానికి ఆమె నివాసం ఉంటోన్న అపార్ట్‌మెంట్‌ కిటికీలోని నుంచి కిందకు దూకెందుకు రెడీ అయ్యింది. ఇంతలో ఎంతో చాకచక్యంగా ఫైర్‌ఫైటర్‌ ఆమెను ఆత్మహత్య చేసుకోకుండా నిలువరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. జపాన్‌కు చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె అపార్ట్‌మెంట్‌లోని కిటికిలోని నుంచి కిందకు దూకెందుకు సిద్దమైంది. ఇంతలో అక్కడకు చేరుకున్న ఫైర్‌ఫైటర్‌.. ఎంతో ధైర్యంతో, చాకచక్యంగా ఆమెను కాపాడాడు. సదరు మహిళ అపార్ట్‌మెంట్‌ పైనున్న ఫ్లాట్‌లోకి వెళ్లిన ఫైర్‌ఫైటర్‌ తాడు సాయంతో​ కిటికి వద్దకు వచ్చి.. ఆమెను ఒక్కసారిగా రెండు కాళ్లతో లోపలికి తన్నాడు. దీంతో, ఆమె కిటికిలోని నుంచి లోపలపడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు