వాకింగ్‌ చేస్తున్నట్లు నటిస్తూ.. మహిళల ఫోటోలు తీసిన వృద్ధుడు

19 May, 2021 15:01 IST|Sakshi

ఫ్లోరిడాలో చోటు చేసుకున్న ఘటన

ఫ్లోరిడా: చూడ్డానికి పెద్ద మనిషి తరహాలో ఉన్నాడు. వయసు కూడా దాదాపు 70 ఏళ్లకు పైనే ఉంటుంది. కానీ బుద్ధి మాత్రం నికృష్టం. ఏం ఏరగని వాటిలా అటూ ఇటూ తిరుగుతూ.. రహస్యంగా బీచ్‌లో ఉన్న ఆడాళ్ల ఫోటోలు, వీడియోలు తీయడం ప్రారంభించాడు. ఇది గమనించిన ఓ యువతి ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి ఫోన్‌ లాక్కొని చూడగా.. తనతో పాటు మరికొందరు మహిళల అసభ్య ఫోటోలు ఉన్నాయి. వాటిని డిలీట్‌ చేసి అతడి నిర్వాకం గురించి బీచ్‌లోని వారందరికి తెలిపింది. ఈ సంఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది.

ఆ వివరాలు..  ఓ మహిళ తన స్నేహితురాలితో కలిసి బీచ్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఓ వృద్ధుడు మరో వ్యక్తితో మాట్లాడుతున్నట్లు నటిస్తూ.. రహస్యంగా వారి ఫోటోలు తీయడం ప్రారంభిస్తాడు. అతడి ప్రవర్తన మీద అనుమానం వచ్చిన మహిళ అతడి దగ్గరకు వెళ్లి ఫోన్‌ లాక్కుని చూడగా మొబైల్‌లో తనతో పాటు మరికొంందరి మహిళల అసభ్య ఫోటోలు ఉన్నాయి. వాటిని చూడగానే సదరు మహిళకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే వాటిని డిలీట్‌ చేయమని ఆదేశించిది. ఆ తర్వాత ఫోన్‌ గ్యాలరీ ఒపెన్‌ చేసి చూడగా మరి కొందరు మహిళల అసభ్య ఫోటోలు దర్శనం ఇచ్చాయ. దాంతో ఆ మహిళ అతడి ఘనకార్యం గురించి అందరికి వెల్లడించి.. వాటిని డిలీట్‌ చేయించింది. 

చదవండి: బూతులు తిడుతూ, రెస్టారెంట్‌ సిబ్బందిని చితక్కొట్టిన మహిళలు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు