‘రేయ్.. వాడు రియల్‌హీరో కాదురా’.. పబ్లిక్‌గా పరువు పోగొట్టుకున్న ఫుట్‌బాల్‌ టీం

22 Nov, 2022 20:33 IST|Sakshi

వైరల్‌: ఓవైపు ఫిఫా వరల్డ్‌కప్‌లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా ఓటమిపాలు అయ్యింది. అదే సమయంలో ఓ ఫుట్‌బాల్‌ టీం చేసిన పని.. సోషల్‌ మీడియాలో వాళ్ల పరువును తీసేస్తోంది. 

అమెరికా నేషనల్‌ ఫుట్‌బాల్‌ టీగ్‌లోని ఓ జట్టు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆదివారం మిన్నెసోటా వైకింగ్స్‌‌, డల్లాస్‌ కౌబాయ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు సాకర్‌ అభిమానుల్ని ఓ కోరిక కోరింది మిన్నెసోటా వైకింగ్స్.

మీ కుటుంబంలోగానీ, స్నేహితుల్లోగానీ ఎవరైనా ఆర్మీలో పని చేస్తే.. ఆ రియల్‌ హీరోల గురించి ప్రస్తావిస్తూ పోస్ట్‌ చేయాలని కోరింది. అలా వచ్చిన పోస్టుల్లో ఎంపిక చేసిన అభిమానికి రెండు టికెట్లు పంపడంతో పాటు.. అతని పోస్ట్‌ను వీడియో బోర్డుపై ప్రదర్శిస్తామని తెలిపింది. అది చూసి చాలామంది #SkolSalute హ్యాష్‌ట్యాగ్‌తో వైకింగ్స్‌కు పోస్ట్‌లు చేశారు.

సరిగ్గా మ్యాచ్‌ ప్రారంభానికి ముందు.. కైలే అనే ట్విటర్‌ హ్యాండిల్‌ పేరుతో ఓ పోస్ట్‌ దర్శనమిచ్చింది. తన కజిన్‌ జోయెల్‌ ఆర్మీలో పని చేశాడంటూ అతని ఫొటోతో సహా పోస్ట్‌ ఉంచాడు ఆ యూజర్‌. అంతేకాదు.. ఇతను నా కజిన్‌. ఆర్మీలో పని చేసేవాడు. అతని హీరోయిజం నాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. అంతేకాదు.. వైకింగ్స్‌కు అతను పెద్ద అభిమాని కూడా అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. 

అయితే.. అందులో ఉంది కట్టుకథే అని కనిపెట్టడానికి అక్కడున్న ప్రేక్షకులకు ఎంతో టైం పట్టలేదు. అందులో ఉంది పో*స్టార్‌ జానీ సిన్స్‌. వెంటనే గ్రౌండ్‌లో విజిల్స్‌, అరుపులు వినిపించాయి. అది గమనించిన టీం నిర్వాహకులు వెంటనే దానిని తొలగించారు. అసలు ఆ కథను ఆ ఫుట్‌బాల్‌ ఎలా నమ్మిందో అర్థం కావడం లేదంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. జరిగిన ఘటనపై వైకింగ్స్‌ మేనేజ్‌మెంట్‌ క్షమాపణలు చెప్పగా.. సంబంధిత విభాగ సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించింది కూడా.

మరిన్ని వార్తలు