టిక్‌టిక్‌తో బాలిక మృతి.. ఇటలీ తీవ్ర ఆగ్రహం

23 Jan, 2021 12:07 IST|Sakshi

సిసిలీ: ఫన్నీ వీడియోలు.. పాటలు.. డ్యాన్స్‌లతో ఆకట్టుకున్న చైనా యాప్‌ టిక్‌టాక్‌ ఓ బాలిక మృతికి కారణమైంది. టిక్‌టాక్‌లో ఓ వీడియో చేస్తున్న ప్రయత్నంలో ఆ బాలిక మృతి చెందడంతో ఇటలీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. యాప్‌లో వచ్చిన ఓ సాహస కృత్యాన్ని చేయడానికి ప్రయత్నించడమే పదేళ్ల బాలిక చేసిన పాపం. ఈ ఘటనతో ఆ యాప్‌పై ఇటలీ ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

సిసిలీలోని ఓ పదేళ్ల బాలిక టిక్‌టాక్‌ వినియోగిస్తోంది. అయితే ‘బ్లాకౌట్‌ చాలెంజ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండీ అవుతున్న వీడియోను చేయడానికి బాలిక ప్రయత్నించింది. అందులో భాగంగా ప్రయత్నం చేస్తూ ఫోన్‌లో రికార్డింగ్‌ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అకస్మాత్తుగా మెడకు బెల్ట్‌ బిగుసుకుపోయి ఆ బాలిక బాలిక్‌ బాత్రూమ్‌లో పడిపోయింది. అస్వస్థతకు గురయిన పడి ఉన్న బాలికను చూసి కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ఆక్సిజన్‌ అందక గుండె కండరాలు స్తంభించడంతో బ్రెయిన్‌ డెడ్‌కు గురై ఆ బాలిక కన్నుమూసింది. అయితే ఆ తల్లిదండ్రులు బాలిక అవయవాలను దానం చేయడం విశేషం.
(చదవండి: 2020లో భారీ లాభాన్ని ఆర్జించిన టిక్‌టాక్)

ఈ ఘటనపై ఇటలీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. టిక్‌టాక్‌ వినియోగంపై తీవ్ర ఆంక్షలు విధించింది. ముఖ్యంగా 13ఏళ్లలోపు బాలబాలికలు ఉపయోగించరాదని నిబంధనలు విధించింది. మైనర్ల రక్షణకు ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. టిక్‌టాక్‌ వినియోగించాలంటే తప్పనిసరిగా 13 ఏళ్లు దాటి ఉండాలని స్పష్టం చేసింది. దీనిపై గత డిసెంబర్‌లోనే నిబంధనలు రూపొందించగా అవి అమలుకాకపోవడంతో ఇటలీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా స్పందించకుంటే టిక్‌టాక్‌ యాప్‌ నిషేధానికి కూడా సిద్ధమైంది. భారత్‌లో గతేడాది జూన్‌ 29వ తేదీన టిక్‌టాక్‌ను నిషేధించిన విషయం తెలిసిందే.
(చదవండి: మోడల్‌ క్రేజ్‌.. ఫాలో అవుతోన్న బైడెన్‌)

మరిన్ని వార్తలు