A Great Experience Thai Riverside Cafe:వరద ఉధృతిని నేరుగా వీక్షిస్తూ ఆస్వాదించచ్చు!

8 Oct, 2021 17:17 IST|Sakshi

సముద్రం వద్ద నదుల వద్ద కేఫ్‌ల్లో  చక్కగా ఎంజాయ్‌ చేసుంటారు. కానీ ఇలా నేరుగా వరద ఉధృతిని చూస్తూ  భోంచేయడమే ఈ థాయ్‌ కేఫ్‌ ప్రత్యేకత

థాయ్‌లాండ్‌: ఒక పక్క కరోనా మహమ్మారీ కారణంగా చాలా వ్యాపారాలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయంటే మరోవైపు ప్రకృతి విపత్తుల కారణంగా  మరింత దారుణంగా దెబ్బతింటున్నాయి. చాలా మంది ఈ పరిస్థితిని  ఎలా చక్కదిద్దుకోవాలో తెలియక నిరాశ నిస్ప్రుహలతో కాలాన్ని వెళ్లదీస్తున్నారు. కానీ కొంతమంది ఆ కష్టాలనే ఆసరాగా చేసుకుని పలు అవకాశాలను సృష్టించుకుని అందరిచేత 'ఔరా' అనిపించేలా గొప్పగా బ్రతికి చూపిస్తారు. అలాంటి కోవకు చెందిన వారే థాయ్‌లాండ్‌కి చెందిన కేఫ్‌ యజమాని టిటిపోర్న్ జుటిమనాన్

(చదవండి: ఎయిర్‌లైన్స్‌ మహిళా సిబ్బంది..... ఇక హైహిల్స్‌, స్కర్ట్స్‌కి స్వస్తీ)

వివరాల్లోకెళ్లితే.......ఈ ఏడాది ఆరంభంలోనే కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృభించి ప్రపంచదేశాలన్ని సెకండ్‌ లాక్‌డౌన్‌ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమలోనే టిటిపోర్న్ జుటిమనాన్ ఉత్తర బ్యాంకాక్‌కు  సమీపంలోని నొంతబురిలో చావో ఫ్రయా యాంటిక్ కేఫ్‌ను నిర్వహిస్తున్నాడు. మొన్నమొనటి వరకు కరోనా కారణంగా లాక్‌ డౌన్‌తో కేఫ్‌ మూసేయడంతో నష్టాల్లో ఉందనకుంటే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా థాయ్‌లాండ్‌లోని నదులన్ని వరదలో పొంగి పొరలుతున్నాయి.

మళ్లీ మరోసారి కేఫ్‌ మూసేయాల్సిందేనా అని ఆలోచనలో మునిగిపోయాడు. దీన్నే అవకాశంగా మార్చుకుని కస్టమర్లను ఎందుకు ఆకర్షించకూడదు అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆచరణలో పెట్టాడు. వరదలకు తగ్గట్టుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కేఫ్‌ రన్‌ చేస్తే.. ఒక పక్క కస్టమర్లు లైవ్‌లో వరద ఉద్దృతిని వీక్షించినట్టు ఉంటుంది, కేఫ్‌ను మళ్లీ యథావిధిగా రన్‌ చేయగలిగే అవకాశం ఉంటుందని టిటిపోర్న్ భావించాడు.

అతనూ ఊహించిందే నిజమైంది. వరదనీటిని చూస్తూ థ్రిల్‌గా ఫీలవుతూ ... కేఫ్‌లో వాళ్లకి ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్‌ చేసుకుని చక్కగా ఆస్వాదిస్తూ తింటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింగ తెగ వైరల్‌ అవుతోంది. అయితే విపత్తును మరో సంక్షోభంగా భావించకుండా దాన్నే కేఫ్‌ యజమాని 'టిటిపోర్న్' ఒక మంచి అవకాశంగా మార్చుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

(చదవండి: ఇక నుంచి వీధుల్లో రోబోల గస్తీ...)

మరిన్ని వార్తలు