సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్‌

20 Feb, 2022 16:37 IST|Sakshi

ఇంతవరకు మనం హెలకాప్టర్‌ క్రాష్‌కి సంబంధించిన పలు ఘటనలు గురించి విన్నాం. ఇటీవల యూకేలోని యూనిస్‌ తుపాను కారణంగా వీచిన ఈదురు గాలుల బీభత్సానికి విమానం ఎంత ప్రమాదకరంగా ల్యాండ్‌ అయ్యిందో చూశాం. అయితే ఇక్కడొక హెలికాప్టర్‌ ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తిందో గానీ అందరూ చూస్తుండగానే బీచ్‌లోని అలల పైకి దూసుకుపోయింది.

అసలు విషయంలోకెళ్తే...అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక హెలికాప్టర్‌ కూలిపోయింది. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.20 నిమిషాలకు ఫ్లోరిడాలోని రద్దీగా ఉండే మియామీ బీచ్‌లో ముగ్గురు ప్రయాణికులతో కూడిన రాబిన్సన్ R44 హెలికాప్టర్ కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్‌తో హెలికాప్టర్‌ క్రాష్‌కి గల కారణాన్ని ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. ఈ మేరకు మయామి బీచ్ పోలీసులు, అగ్నిమాపక విభాగాలు ఘటనాస్థలికి వచ్చి ఇద్దరు ప్రయాణికులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు ట్విట్టర్‌లో తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: హెలికాప్టర్‌​ బొమ్మతో ఆడుకుంటుండగా హేళన.. సీరియస్‌గా తీసుకుని కొడుకు పెళ్లికి ఏకంగా హెలికాప్టర్‌!)

మరిన్ని వార్తలు