మీడియా సాక్షిగా చైనా మాజీ అధ్యక్షుడి జింటావో గెంటివేత!

23 Oct, 2022 05:05 IST|Sakshi

సదస్సు ముగింపులో హైడ్రామా

బీజింగ్‌:  చైనాలో కమ్యూనిస్టు పార్టీ సదస్సు ముగింపు సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. చైనా మాజీ అధ్యక్షుడు హూ జింటావో (79)ను మీడియా సాక్షిగా హాల్‌ నుంచి గెంటేశారు. జిన్‌పింగ్‌ పక్కన ఇతర అత్యున్నత స్థాయి నేతలతో పాటు ముందు వరుసలో కూర్చుని ఉన్న ఆయనతో ఇద్దరు వచ్చి కాసేపు మాట్లాడారు.

చివరికి జింటావో అయిష్టంగానే వారితో పాటు వెళ్లిపోయారు. దాంతో పార్టీ నాయకులంతా బిత్తరపోయారు. మీడియాను హాలోలోకి అనుమతించాక అందరి ముందే ఇదంతా జరగడం యాదృచ్ఛికం కాదని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 2012లో జింటావో నుంచే జిన్‌పింగ్‌ చైనా అధ్యక్ష పగ్గాలు స్వీకరించడం గమనార్హం!

ఇక్కడ చదవండి: జిన్‌పింగ్‌ మూడోస్సారి!

మరిన్ని వార్తలు