పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ మద్దతుదారుల అరాచకం.. వీడియోలు వైరల్‌

26 May, 2022 08:58 IST|Sakshi

దాయాది దేశం పాకిస్తాన్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మద్దతుదారులు బుధవారం రెచ్చిపోయారు. నిరసనల్లో భాగంగా మెట్రో స్టేషన్‌కు నిప్పంటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

వివరాల ప్రకారం.. అవిశ్వాస తీర్మానం తర్వాత అధికారం కోల్పోయిన పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కొత్త డిమాండ్‌ను లేవనెత్తారు. పాకిస్తాన్‌లో ఎన్నికలు జరపాలంటూ డిమాండ్‌ చేస్తూ తన మద్దతుదారులతో కలిసి బుధవారం ఇస్లామాబాద్‌లో శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీకి భారీ సంఖ‍్యలో ఇమ్రాన్‌ మద్దతుదారులు విచ్చేశారు. ర్యాలీ నేపథ్యంలో పీటీఐ పార్టీ మద్దతుదారులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

ఈ క్రమంలో పంజాబ్ ప్రావిన్స్‌లో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి కొందరు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో రెచ్చిన పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్‌ మద్దతుదారులు.. చైనా చౌక్‌ మెట్రోస్టేషన్‌కు, అక్కడున్న చెట్లకు నిప్పంటించారు. కాగా, నిరసనల్లో పీటీఐ పార్టీకి చెందిన ఫైసల్ అబ్బాస్ చౌదరి బట్టి చౌక్ సమీపంలో వంతెనపై నుండి పడి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఇక, పోలీసులే అబ్బాస్‌ను వంతెనపై నుంచి తోసేశారని పార్టీ నేత షఫ్కత్ మెహమూద్ ఆరోపించారు.

ఇది కూడా చదవండి: అమెరికాలో ఉన్మాది కాల్పులు..:19 చిన్నారులు బలి

మరిన్ని వార్తలు