Pak Ex PM Imran Khan: నన్ను అపహరించి, చంపేయడమే వారి ముఖ్య ఉద్దేశ్యం

15 Mar, 2023 15:24 IST|Sakshi

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ని పోలీసులు మంగళవారం అరెస్టు చేసేందుకు యత్నించగా, అతని మద్దతుదారులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులపై ఇమ్రాన్‌ఖాన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులు తన నివాసం వద్ద అరెస్టు చేయాలనే ప్లాన్‌ వెనుక ఉన్న ముఖ్యోద్దేశం తనను అపహరించి, చంపయేడమేనని ఆరోపించారు. అంతేగాక తన మద్దతుదారులను అడ్డుకునేలా బలగాలను సైతం రంగంలోకి దింపారని మండిపడ్డారు.

అందుకు సంబంధించిన కాల్పుల దృశ్యాలను ఖాన్‌ ట్వీట్‌ చేశారు. ఇవి పోలీసుల దుర్మార్గపు ఆలోచనను బయటపెడుతున్నాయని ఆయన అన్నారు. అరెస్టు చేయడం అనేది ఒక నాటకీయంగా జరుగుతుందని. తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘మద్దతుదారులను కట్టడి చేసేందుకు టియర్‌ గ్యాస్‌తో సహా కాల్పులకు దిగారు పోలీసులు, నేను మంగళవారం బెయిల్‌పై వచ్చేందుకు పూచీకత్తుపై సంతకం చేశాను. దీన్నీ స్వీకరించడానికి డీఐజీ నిరాకరించారు. దీనిని బట్టే వారి అసలు ఉద్దేశ్యం ఏమిటో అర్థమవుతోంది. అదీగాక మద్దతుదారులను ఎదుర్కోవడానికి పారామిలటరీ సిబ్బందిని దింపడంపై ఆంతర్యం ఏంటి’ అని మండిపడ్డారు.

ఘర్షణలు తలెత్తకుండా తటస్థ వైఖరినే అవలంభిస్తాం అని చెబుతుండే పాలకులు ఇప్పడూ చేస్తోంది ఏంటి అని నిలదీశారు. ఇప్పటికే అక్రమ వారెంట్‌కి సంబంధించిన కేసును కోర్టులో ఎదుర్కొంటున్నప్పుడూ ఇప్పుడూ ఇలాంటి డ్రామాలకు తెరతీయడం ఏమిటని ప్రశ్నించారు. కాగా, అవినీతి ఆరోపణలు, తోషాఖాన్‌ కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌ని అరెస్టు చేసేందుకు గత కొన్నిరోజులుగా ప్రత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లాహోర్‌లోని జమాన్‌ పార్క్‌లో ఉన్న ఆయన ఇంటి వద్ద గత రెండు వారాలుగా హైడ్రామా కొనసాగింది. 

(చదవండి: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు యత్నం.. రాళ్లు రువ్వి అడ్డుకుంటున్న మద్దతుదారులు)

మరిన్ని వార్తలు