కాల్పుల్లో గాయపడిన భారతీయ విద్యార్థి మృతి

24 Nov, 2023 05:54 IST|Sakshi

సిన్సినాటి: అమెరికాలోని ఓహియోలో గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆదిత్య అడ్లఖా(26) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 18న తుదిశ్వాస విడిచారు. ఓహియో రాష్ట్రం యూనివర్సిటీ ఆఫ్‌ సిన్సినాటిలో డాక్టరేట్‌ చేస్తున్న ఆదిత్య ఈనెల 9న కారులో వెళ్తుండగా దుండగులు పలుమార్లు అతడిపైకి కాల్పులు జరిపారు.

దీంతో అతడు తీవ్రంగా గాయపడగా, కారు అదుపుతప్పి గోడను ఢీకొని ఆగిపోయింది. ఆదిత్యను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ 18న అతడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని రాంజస్‌ కాలేజీలో బీఎస్సీ, 2020లో ఎయిమ్స్‌లో ఫిజియాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసిన అతడు సిన్సినాటి యూనివర్సిటీలో జాయినయ్యారు. కాగా, కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు