Israel-Hamas war: హమాస్‌ రాక్షసత్వం

20 Oct, 2023 05:47 IST|Sakshi

హ్యారీ పోట్టర్‌ అభిమాని కిడ్నాప్‌ విషాదాంతం

ఇజ్రాయెల్‌ బాలిక నోయా డాన్‌

అపహరణ, హత్య

టెల్‌ అవీవ్‌:  ప్రఖ్యాత రచయిత్రి జేకే రౌలింగ్‌ రచించిన హ్యారీ పోట్టర్‌ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. చిన్నపిల్లలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇజ్రాయెల్‌కు చెందిన 12 ఏళ్ల బాలిక నోయా డాన్‌ ఆటిజం బాధితురాలు. ఆమెకు హ్యారీ పోట్టర్‌ సాహసాలంటే చెప్పలేనంత ఇష్టం. ఈ సిరీస్‌లో వచ్చిన పుస్తకాలన్నీ చదివేసింది. ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్‌ మిలిటెంట్లు నోయా డాన్‌ను అపహరించారు.

ఆమె నాన్నమ్మతోపాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు బందీలుగా గాజాకు చేరారు. వారంతా ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలియరాలేదు. అసలు బతికున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఆటిజం బాధితురాలైన నోయా డాన్‌ను విడుదల చేయాలని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం హమాస్‌ను కోరింది. హ్యారీపోట్టర్‌ పాత్రధారి ఆహార్యంతో ఉన్న నోయా డాన్‌ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ఈ పోస్టును ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది షేర్‌ చేశారు. హమాస్‌ చెర నుంచి నోయా డాన్‌ను విడిపించేందుకు చొరవ చూపాలంటూ జేకే రౌలింగ్‌కు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

జేకే రౌలింగ్‌ వెంటనే స్పందించారు. హ్యారీ పోట్టర్‌ అభిమాని కిడ్నాప్‌ అయ్యారని తెలుసుకొని చలించిపోయారు. ఆమెకు విముక్తి కలి్పంచాలని హమాస్‌ను అభ్యరి్థంచారు. నోడా డాన్‌ క్షేమంగా తిరిగిరావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రౌలింగ్‌ ప్రతిస్పందన తర్వాత ఇజ్రాయెల్‌ వ్య«థకు నోయా డాన్‌ ఒక ప్రతీకగా మారిపోయారు. ఇజ్రాయెల్‌ పౌరులంతా ఆమె గురించి చర్చించుకున్నారు. క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షించారు. కానీ, ఇంతలోనే దుర్వార్త వినాల్సి వచ్చింది.

నోయా డాన్‌తోపాటు ఆమె నాన్నమ్మ కార్మెలా మృతదేహాన్ని బుధవారం గాజాలో గుర్తించినట్లు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. నోయా డాన్‌ ఇక లేదని తెలిసి ఇజ్రాయెల్‌ ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. బాలికను హమాస్‌ మిలిటెంట్లు హత్య చేసినట్లు తెలుస్తోంది. ‘‘అమ్మా, నాకు చాలా భయమేస్తోంది. ఎవరో బూచాళ్లు మన ఇంట్లోకి వచ్చారు. వెంటనే వచ్చి నన్ను నీతో తీసుకెళ్లు’’.. బయటకు వెళ్లిన తన తల్లితో ఫోన్‌లో నోయా డాన్‌ చివరి సంభాషణ ఇది.

మరిన్ని వార్తలు