జీ 7 సదస్సులో.. మోదీని ఆటోగ్రాఫ్‌ అడిగిన జో బైడెన్‌!

21 May, 2023 17:36 IST|Sakshi

జపాన్‌లోని హిరోషిమాలో జీ 7 సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆటోగ్రాఫ్‌ అడిగారు. ఈ మేరకు ఆ సదస్సులో జో బైడెన్‌, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌.. ప్రధాని మోదీ వద్దకు వచ్చి ఆయన విషయంలో తాము ఎదుర్కొంటున్న విచిత్రమైన సవాళ్లను పంచుకున్నారు. జూన్‌ నెలలో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు.

ఆ విషయం గురించి బైడెన్‌ ప్రస్తావిస్తూ.. భారత ప్రధాని మోదీ కార్యక్రమాలకు హాజరుకావడానికి పౌరుల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న అభ్యర్థనల వరద తమకు ఎలా సవాలుగా మారిందో వివరించారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియ ప్రధాని అల్బనీస్‌ విజయోత్సవ ల్యాప్‌లో దాదాపు 90 వేల మందికి పైగా ప్రజలు ప్రధాని మోదీకి ఎలా స్వాగతం పలికారో గుర్తు చేస్తుకున్నారు.

ఈ మేరకు ఆయన మోదీతో మాట్లాడుతూ సిడ్నీలో కమ్యూనిటీ రిసెప్షన్‌  కెపాసిటీ 20 వేల మందికి సరిపడేదని, అయినా ఇప్పటికీ అందుత్ను రిక్వెస్ట్‌లను మేనేజ్‌ చేయలేకపోతున్నానని అన్నారు. ప్రధాని మోదీకి ఉన్న ప్రజాధరణ గురించి అల్బనీస్‌ సంభాస్తుండగా.. మధ్యలో బైడెన్‌ జోక్యం చేసుకుంటూ.. ‘నాకు మీ ఆటోగ్రాఫ్‌ ఇవ్వండి’ అని వ్యాఖ్యానించారు. కాగా, జపాన్‌లోని హిరోషిమాలో జరుగుతున్న జీ7 సదస్సులో సుమారు 22 దేశాలకు చెందిన ప్రతినిధుల పాల్గొన్నారు. 

(చదవండి: క్లీనర్‌ సాయంతో పేషెంట్‌కి సర్జరీ..దెబ్బతో ఆ వైద్యుడి..)

మరిన్ని వార్తలు