పాకిస్తాన్‌‌, బంగ్లాదేశ్‌ కంటే భారత్‌ వెనుకంజ

20 Mar, 2021 14:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వరల్ఢ్‌ హ్యాపినెస్‌ రిపోర్ట్‌

మరొకసారి టాప్‌లో ఫిన్లాండ్‌

వరల్ఢ్‌ హ్యాపినెస్‌ రిపోర్ట్‌లో ఫిన్లాండ్‌ వరుసగా నాలుగోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 149 దేశాలకు చెందిన ప్రజలు ఎంత సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారనే దానిపై జరిపిన సర్వేలో ఫిన్లాండ్‌ మరొకసారి టాప్‌లో నిలిచింది.  ఈ మేరకు వరల్ఢ్‌ హ్యాపినెస్‌ రిపోర్ట్‌- 2021ను యూఎన్‌  సస్టేనబుల్‌ డెవలప్‌మెంట్‌ సోల్యూషన్స్‌ నెటెవర్క్ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్‌ 139వ స్థానంలో నిలిచింది. కాగా, గత ఏడాది కంటే భారత్‌  హ్యాపినెస్‌ ఇండెక్స్‌లో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. కాగా పొరుగు దేశాలైన పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ , చైనాల కంటే  హ్యాపినెస్‌ ఇండెక్స్‌లో భారత్‌ వెనుకంజలో ఉండడం గమనార్హం.  

నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ 105, బంగ్లాదేశ్ 101, చైనా 84 వ స్థానంలో నిలిచాయి. చివరి మూడు స్థానాల్లో ఆఫ్ఘనిస్తాన్‌ 149, జింబాబ్వే 148, రవాండా 147, నిలిచాయి.ప్రతి ఏడాది యూఎన్‌ హ్యాపినెస్‌ ఇండెక్స్‌ను విడుదల చేస్తోంది. ఈ ఇండెక్స్‌ను గాలప్ వరల్డ్ పోల్ నిర్వహించే  ప్రశ్నల ఆధారంగా ప్రపంచ దేశాలకు ర్యాంకులను నిర్ణయిస్తోంది. దాంతో పాటుగా  దేశాల జీడిపీ, సామాజిక భద్రతను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ సూచీను ఆయా దేశాల జీడీపీ, సామాజిక భద్రత, దాతృత్వం, ప్రజల ఆరోగ్య స్థితిగతులు, లంచగొండితనం , ప్రజల నిర్ణయాల్లో స్వతంత్రత వంటి విషయాలను పరిగణలోనికి తీసుకుంటుంది.

2021 ప్రపంచంలోనే సంతోషకరమైన మొదటి  20 దేశాల జాబితా...
1. ఫిన్‌ లాండ్‌
2. డెన్మార్క్‌
3. స్విట్జర్లాండ్
4. ఐస్‌ లాండ్‌
5. నెదర్లాండ్స్
6. నార్వే
7. స్వీడన్
8. లక్సెంబర్గ్
9. న్యూజిలాండ్
10. ఆస్ట్రియా
11. ఆస్ట్రేలియా
12. ఇజ్రాయెల్
13. జర్మనీ
14. కెనడా
15. ఐర్లాండ్
16. కోస్టా రికా
17. యునైటెడ్ కింగ్‌డమ్
18. చెక్ రిపబ్లిక్
19. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్‌ అమెరికా
20. బెల్జియం

>
మరిన్ని వార్తలు