ఎన్టీఆర్ 'దేవర' అప్డేట్.. జాతరలో క్రేజీ ఫైట్‌ 

26 Dec, 2023 00:03 IST|Sakshi

ఒకవైపు గంగమ్మ జాతర జోరుగా జరుగుతోంది. గంగమ్మ భక్తుడు దేవర భక్తి శ్రద్ధలతో జాతరలో పాల్గొంటున్నాడు. అయితే జాతరలో విలన్లతో ఫైట్‌ చేయాల్సి వచ్చింది. అంతే.. రఫ్ఫాడించాడు. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ చిత్రంలోని జాతర ఇది. ఎన్టీఆర్‌ పాత్ర పేరు దేవర.

ఈ చిత్రంలో గంగమ్మ జాతర నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఉన్నాయని తెలిసింది. ఈ జాతర బ్యాక్‌డ్రాప్‌లోనే భారీ ఫైట్‌ ఉంటుందట. ఈ జాతర, ఫైట్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచేంత భారీగా ఉంటాయని భోగట్టా. ఈ చిత్రంలో ఉన్న పోరాట సన్నివేశాలన్నీ భారీగా ఉంటాయని తెలిసింది.

వాటిలో ముఖ్యంగా నీటి లోపల తీసిన యాక్షన్‌ సీన్, జాతర బ్యాక్‌డ్రాప్‌ ఫైట్‌ భారీ స్థాయిలో ఉంటాయట. ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్‌ తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ‘దేవర’ తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. 

>
మరిన్ని వార్తలు