వీడియో: ఈ తాత మామూలోడు కాదండోయ్‌

5 Mar, 2022 13:45 IST|Sakshi

తాత అనేగానే.. ఒళ్లు కుంగిపోయి, చర్మం ముడతలు పడి, సరిగ్గా కదల్లేక ఓ మూలన కూర్చుంటాడు అనుకుంటారేమో. ‘కబాలీ.. రా’ రేంజ్‌లో హుషారు చూపిస్తుంటాడీ తాత. 

ఈ తాత మామూలోడు కాదు. పేరు.. సావాంగ్‌ జన్‌ప్రామ్‌. వయసు 102 ఏళ్లు. ఉండేది థాయ్‌లాండ్‌ సాముత్‌ సాంగ్‌ఖ్రమ్‌ ప్రావిన్స్‌లో. పోయినవారం అక్కడ 26వ ఇటెరేషన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరిగాయి. అందులో 100-105 ఏళ్ల కేటగిరీకి జరిగిన పోటీల్లో ఈ తాతే మొత్తం మెడల్స్‌ మెడలో వేసేసుకున్నాడు.  స్వతహాగానే ఈ పెద్దాయన ఒక అథ్లెట్‌. అందుకే ఈ ఏజ్‌లోనూ హుషారుగా పోటీల్లో పాల్గొంటూ వస్తున్నాడు. ఈసారి పోటీల్లో ఈయనగారు ఏకంగా ఓ రికార్డ్‌ కూడా నెలకొల్పాడు. 

తన ఈడు వాళ్లతో పోటీపడి వంద మీటర్ల పరుగు పందెంను 27.08 సెకన్లలో పూర్తి చేశాడు. 100 మీటర్ల పరుగు పందెంలో జమైకా పరుగుల వీరుడు ఉస్సేన్‌ బోల్ట్‌ పేరిట ఉంది(2009లో 9.58 సెకండ్లు). అలాంటిది ఈ ఏజ్‌లో ఈ తాత ఈ రికార్డును నెలకొల్పడం గొప్పే కదా! 

ఈ గొప్పతనం వల్లే ఈ తాతకి.. లేడీస్‌లోనూ ఫుల్‌ ఫాలోయింగ్‌ ఉంది. యూత్‌ ఫిజికల్‌ టిప్స్‌ కోసం ఈ తాతను కలుస్తుంటారు.. ఇక డెభ్భై ఏళ్ల ఆయన కూతురే సిరిపాన్‌.. ప్రస్తుతం సావాంగ్‌కు ట్రయినర్‌గా ఉంది.  ఆటలే నన్ను ధృడంగా ఉంచుతున్నాయి. టైంకి మంచిగా తిని.. ఎక్సర్‌సైజులు గట్రా చేస్తే నాలాగే మీరూ ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నాడు ఈ తాత. వీటితో పాటు పాజిటివ్‌ మైండ్‌ తన తండ్రి ఆరోగ్య రహస్యం అంటోంది సిరిపాన్‌.

థాయ్‌లాండ్‌ మాస్టర్‌ అథ్లెట్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు 1996 నుంచి నడుస్తున్నాయి. అప్పుడు కేవలం 300 మంది మాత్రమే పాల్గొన్నారు. మరి ఇప్పుడో.. 2 వేల మంది.. అదీ 35 నుంచి 102 ఏళ్ల మధ్యవయస్కులు పాల్గొంటున్నారు. అంటే.. ఫిట్‌నెస్‌ మీద థాయ్‌లాండ్‌ ప్రజలకు ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు