అమెరికాలో దుమ్ము బీభత్సం

17 Jul, 2022 06:37 IST|Sakshi

హర్డిన్‌: అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో సంభవించిన దుమ్ము తుపాను ఆరు ప్రాణాలను బలి తీసుకుంది. గంటకు 60 మైళ్ల వేగంతో వీచిన బలమైన గాలులు, దుమ్ము తుపానులో హార్డిన్‌ సమీపంలో మోంటానా ఇంటర్‌ స్టేట్‌ హైవేపై వెళ్తున్న వాహనాలు చిక్కుకున్నాయి.

దారి కనిపించక ట్రాక్టర్‌ ట్రయిలర్లు, కార్లు తదితర 21 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనల్లో ఆరుగురు చనిపోయారని, క్షతగాత్రుల సంఖ్య తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడిందన్నారు.  

మరిన్ని వార్తలు