Expensive Minerals in World: కోట్లు పలికే ‘రంగురాయి’ ఏది?

4 Oct, 2023 07:04 IST|Sakshi

ఎవరైనా ఏదైనా ఖరీదైన వస్తువు గురించి మాట్లాడినప్పుడు ముందుగా బంగారాన్ని ప్రస్తావిస్తారు. నిజానికి ఒక గ్రాము బంగారం కొనాలన్నా కూడా చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్లాటినం దాని కంటే ఖరీదైనదిగా పరిగణిస్తారు. అయితే బంగారం, ప్లాటినం మాత్రమే అత్యంత ఖరీదైన ఖనిజాలు కాదు. దీనికంటే ఖరీదైన ఖనిజాలు భూమిపై చాలా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఖనిజం ఏది? దాని ధర ఎంత అనేది  తెలుసుకుందాం.

బంగారం కంటే ఖరీదైన ఖనిజాల ప్రస్తావన వచ్చినప్పుడు ఈ జాబితాలో అనేకమైనవి కనిపిస్తాయి. వాటిలో మనం ఉపయోగించే వాటి విషయానికొస్తే రోథియం, పల్లాడియం, ఇరిడియం, జాడైట్ మొదలైనవి ఉన్నాయి. ఇవేకాకుండా మనం నేరుగా ఉపయోగించని అనేక ఖనిజాలు కూడా ఉన్నాయి. అవి బంగారం కంటే చాలా ఖరీదైనవి. వీటిలో లిథియం లాంటి అనేక పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు అత్యంత ఖరీదైన ఖనిజం ఏమిటో తెలుసుకుందాం.

అత్యంత ఖరీదైన ఖనిజం విషయంలో అనేక వాదనలు వినిపిస్తాయి. దానికి సంబంధించిన అనేక నివేదికలు కనిపిస్తాయి. ఆ నివేదికల ప్రకారం చూస్తే రోథియం అత్యంత ఖరీదైనది. మరికొందరు శాస్త్రవేత్తలు జాడైట్  ఖనిజం అత్యంత ఖరీదైనదిగా చెబుతారు. జాడైట్ ఒక రకమైన రాయి. అది లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనిని ఖరీదైన ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. దీని ధర క్యారెట్‌లలో ఉంటుంది. డైమండ్ మాదిరిగా ఇది క్యారెట్ల లెక్కన లభిస్తుంది. జాడైట్ క్యారెట్ ధర చాలా అధికం. ఒక క్యారెట్ జాడైట్ ధర 3 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అని చెబుతారు. అంటే ఒక్క జాడైట్ రాయి కోసం కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. 
ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో బిచ్చగాళ్లు అధికం?

మరిన్ని వార్తలు