సొంత కూతురిపైనే సైబర్‌ వేధింపులు! ఆఖరికి కూతురి క్లాస్‌మేట్‌ను...

20 Dec, 2022 20:36 IST|Sakshi

సొంత కూతురిపైనే సైబర్‌ వేధింపులకు ఒడిగట్టింది ఒక మహిళ.  ఆఖరికి ఆమె బాయ్‌ఫ్రెండ్‌, క్లాస్‌మేట్‌లను సైతం వేధింపులకు గురి చేసినట్లు విచారణలో తేలడంతో ఆమె జైలు పాలయ్యింది. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే...42 ఏళ్ల కెన్రా గెయిల్‌ లికారీ అనే మహిళ తన సొంత కూతరిని, ఆమె బాయ్‌ప్రెండ్‌ని, క్లాస్‌మేట్స్‌ని వివిధ మెసేజ్‌లతో సైబర్‌ వేధింపులకు పాల్పడింది. ఆమె ఫేక్‌ ఐడింటిటీతో 2021 నుంచి ఆన్‌లైన్‌లో టీనేజర్లను ఇలా వేధింపులకు గురి చేసినట్లు తెలిసింది. ఈ మేరకు టినేజర్లను వేధింపులకు గురిచేస్తున్నట్లు బీల్‌ సిటీ పబ్లిక్‌ స్కూల్స్‌ ఫిర్యాదు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఈ కేసును దర్యాప్తు చేసింది. విచిత్రమేమిటంటే సదరు మహిళ ఆ స్కూల్‌లోనే బాస్కెట్‌ బాల్‌ కోచ్‌గా పనిచేస్తోంది.

ఐతే విచారణలో  సదరు మహిళ ఫేక్‌ ఐడింటిలతో టీనేజర్లను లక్ష్యంగా వేధించే సందేశాలను పంపినట్లు పోలీసులు గుర్తించారు. తనను గుర్తుపట్టకుండా ఉండేలా సాఫ్ట్‌వేర్‌ను, వివిద ప్రాంతాల నెంబర్లను, కోడ్‌లను వినియోగించినట్లు తేలింది. సైబర్‌ పోలీసులు ఆమెను ఐపీ అడ్రస్‌ సాయంతో ఆమెను ట్రాక్‌ చేశారు. ఆమె తన కూతురికి లేదా ఆమె క్లాస్‌మేట్‌లకి పంపించిన సుమారు పదివేల టెక్స్ట్‌ మెసేజ్‌లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ మేరకు సదరు మహిళపై ఐదు ఆరోపణలు మోపి కోర్టు ముందు హజరపరిచారు. దీంతో ఆమె సైబర్‌ వేధింపులకు పాల్పడినందుకుగానూ 10 ఏళ్లు జైలు శిక్ష, నేరాన్ని తారుమారు చేసేందుకు యత్నించినందుకు గానూ మరో ఐదు ఏళ్లు జైలు శిక్ష ఎదుర్కొటోంది. ఐతే ఆమె ప్రస్తుతం తాజాగా సుమారు రూ. 4 లక్షల పూచికత్తుతో బెయిల్‌పై విడుదలయ్యింది.

(చదవండి: చైనాలో నిమ్మకాయలకు అమాంతం పెరిగిన డిమాండ్‌! కారణం ఏంటంటే..)

మరిన్ని వార్తలు