Tanzania: ‘ఏంటో ఈ వింత’.. మహిళా ఎంపీ దుస్తులపై విమ‌ర్శ‌లు

3 Jun, 2021 10:08 IST|Sakshi

డోడోమా: సాధారణంగా పార్లమెంట్‌ సమావేశాల్లో పదే పదే ఆటంకం కలిగిస్తూ, గందరగోళం సృష్టిస్తే కొన్ని సమయాల్లో ఎంపీలు సభ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే తాజాగా టాంజానియీ దేశ పార్లమెంట్‌లో చోటు చేసుకున్న ఓ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ‘నువ్వేంటో నీ వింత బట్టలు ఏంటో? స‌భ‌ను గౌర‌వించి త‌క్ష‌ణ‌మే భ‌య‌ట‌కు వెళ్లిపో’ అంటూ ఆ దేశ పార్లమెంట్‌ స్పీక‌ర్ ఓ మ‌హిళ ఎంపీని స‌భ‌ నుంచి బయ‌ట‌కు పంపించారు. ప్ర‌స్తుతం ఈ విషయం పార్ల‌మెంట్‌లో చర్చనీయ అంశంగా మారింది.

టాంజానియాలో ఓ మ‌హిళా ఎంపీ నలుపు రంగు ప్యాంటు, పసుపు రంగు టాప్ ధరించి పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. దీంతో ఆమె ధ‌రించిన దుస్తుల‌పై వివాదం త‌లెత్తింది. బిగుతైన దుస్తులు ధరించినందుకు ఆమె క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఇత‌ర ఎంపీలు డిమాండ్ చేశారు. మంచి దుస్తులు ధ‌రించి సభలోకి రావాలని స్పీకర్‌ ఆమెకు తెలిపారు. ఈ విషయంపై స్పీక‌ర్ సిచ్వాలే మాట్లాడుతూ.. ‘మా సోదరీమణులు కొందరు వింత బట్టలు ధరిస్తున్నారు. స‌భ్య‌ సమాజానికి ఏం సందేశం ఇవ్వాల‌ని అనుకుంటున్నారు. దేశంలో ఉన్నతమైన పార్లమెంట్‌ స‌భ‌, సాంప్ర‌ద‌యాల్ని అందరూ తప్పకుండా గౌర‌వించాలి. ముఖ్యంగా దుస్తుల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. లేదంటే అటువంటి వాళ్ల‌పై సభ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుందని హెచ్చ‌రించారు. ఇదిలా ఉంటే.. స్పీకర్‌ వ్యవహారశైలి పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి మహిళల వస్త్రధారణ గురించి ఇలా మాట్లాడటం సరికాదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
చ‌ద‌వండి: నల్లగా ఉంది ఈమె ఫ్యాషన్‌ బ్లాగరా అన్నారు
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు