అమెరికాని ఆపడం అసాధ్యం...చైనాకి స్ట్రాంగ్‌ వార్నింగ్‌

9 Aug, 2022 21:36 IST|Sakshi

న్యూయార్క్‌: అమెరికా అసెంబ్లీ ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన పెద్ద ప్రకంపనమే సృష్టించిన సంగతి తెలిసిందే. చైనా అమెరికా పైన యుద్ధం చేస్తుందేమో అన్నంత ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు బైడెన్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెలోసీ మాట్లాడుతూ...చైనా ఆర్భాటం చూసి తమ కాంగ్రెస్‌ సభ్యుల బెదిరిపోయారని అన్నారు.

అయినా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఒక పక్కన భయపడి చస్తునే వార్నింగ్‌లు ఇస్తోందంటూ మండిపడ్డారు. అయినా చైనా యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యుల షెడ్యూల్‌ని చైనా నియంత్రించలేదు అని తేల్చి చెప్పారు. చైనా అచ్చం భయపడి చస్తున్న రౌడీలాగా ప్రవర్తిసుందన్నారు. ఈ పర్యటన కేవలం బైడెన్‌ తైవాన్‌ ప్రాంతాల్లో దృష్టిని కేంద్రీకరించేలా బలోపేతం చేయడానికి వెళ్లిందే తప్ప మరోకటి కాదని అన్నారు పెలోసీ. హౌస్‌ స్పీకర్‌గా మాత్రమే వెళ్లానని అమెరికా చెబుతున్నా చైనా వినకుండా కయ్యానికి కాలు దువ్వేందుకు సిద్దమైపోయిందని విమర్శించారు. అంతేకాదు తైవాన్‌ని ఒంటరిని చేయడంలో భాగస్వామ్యం కాబోమంటూ చైనాకి గట్టి వార్నింగ్‌ ఇచ్చారు.

(చదవండి:  ఆహా! కోటు వేసుకోవడం ఎంత కష్టమో... బైడెన్‌ చూస్తే తెలుస్తుంది)

మరిన్ని వార్తలు