షింజో అబేకు నివాళులు అర్పించిన మోదీ.. ఆయనను భారత్ మిస్ అవుతోందని విచారం

27 Sep, 2022 13:25 IST|Sakshi

టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు ఘన నివాళులు అర్పించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. టోక్యోలో జరిగిన ఈ కార్యక్రమానికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సహా ప్రపంచదేశాలకు చెందిన 217 మంది ప్రతినిధులు హాజరయ్యారు. జపాన్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అబే అంత్యక్రియలను నిర్వహించింది. మూణ్నెల్ల క్రితం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అబేను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపడం తెలిసిందే.

అంతకుముందు జపాన్ ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిదాతో సమావేశమయ్యారు మోదీ.  ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. షింజో అబే సేవలను భారత్‌ ఎంతగానో మిస్ అవుతోందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు.

చదవండి: 'గే' మ్యారేజెస్‌కు ఆ దేశంలో చట్టబద్దత

మరిన్ని వార్తలు