Kim Jong Un: నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌ మరో సంచలన నిర్ణయం..

16 Feb, 2022 21:28 IST|Sakshi

ప్యాంగ్ యాంగ్‌ : వింత శిక్షలతో, వివాదాస్పద నిర్ణయాలతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రపంచానికే సవాళ్లను విసిరిన సందర్భాలు కూడా ఉన్నాయి. అమెరికాకు డోనాల్డ్ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్‌, కిమ్‌ మధ్య పెద్ద మాటల యుద్దమే జరిగింది. ఏరోజు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ప్రపంచ దేశాలు వణికిపోయాయి. మూడో ప్రపంచ యుద్ధమే వస్తుంది అన్నంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

ఇదిలా ఉండగా కిమ్‌ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. వివరాల ప్రకారం.. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన తండ్రి జోంగ్ ఇల్‌ సమాధి వద్ద ప్రతీ ఏడాది కింజోంగిలియా అనే పూల మొక్కలను నాటిస్తారు. ఇలా నాటి మొక్కలను సంరక్షించేందుకు కిమ్.. ఇద్దరు వ్యక్తులకు నియమించాడు. అయితే, ప్రతీ ఏడాది పూలు పూసే మొక్కలు ఈ సంవత్సరం చోటుచేసుకున్న వాతావరణ మార్పుల కారణంగా పూయలేదు. ఈ విషయం కిమ్‌ దృష్టికి రాగా.. ఇద్దరు తోటమాలీలకు సంచలన శిక్ష విధించారు. ఒకరికి మూడు నెలలు, మరో వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించి వార్తల్లో నిలిచారు. ఈ శిక్షలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు