మిస్టరీగా కిమ్‌ ఆచూకీ.. పీపుల్స్‌ ఆర్మీ వార్షికోత్సవం హాజరుపై సందిగ్ధం

7 Feb, 2023 12:33 IST|Sakshi

తరుచుగా వార్తలో నిలిచి ఉత్తర కొరియా అధ్యక్షుడు ​కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తాజాగా అదృశ్యమై మరోసారి వార్తల్లో నిలిచారు. దీంతో ఆయనకు ఆరోగ్యం బాగోలేదని అందువల్లే.. గతకొద్ది రోజులుగా ఆర్మీ ముందుకు రావడం లేదంటూ ఉహగానాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అదీగాక ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌లో పీపుల్స్‌ ఆర్మీ వ్వవస్థాపక వార్షికోత్సవ పురస్కరించుకుని సాముహిక కవాతులను నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఆయన కనిపంచకపోవటం ఉత్తర కొరియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఐతే కిమ్‌ అనుహ్యంగా గత నెల రోజులుగా బహిరంగంగా కనిపించటం లేదని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. అఖరికి ఆదివారం జరిగిన పొలిబ్యూటో సమావేశాన్ని కూడా కిమ్‌ దాటవేసినట్లు సమాచారం. వాస్తవానికి కిమ్‌ ఇలా గతంలో 2014లో దాదాపు 40 రోజుల పాటు పబ్లిక్‌గా కనిపించకుండా ఉన్నట్లు ఉత్తర కొరియా స్థానిక మీడియా పేర్కొంది. కానీ సరిగ్గా ఇదే సమయంలో పీపుల్స్‌ ఆర్మీ 75వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం లేదా బుధవారం ప్యోంగ్యాంగ్‌లో సాముహిక కవాతులు నిర్వహించనుంది. అయితే వార్షికోత్సవంలో కనిపిస్తాడా లేదా అనేది సందిగ్ధంగా ఉంది.

అలాగే కిమ్‌ కూడా ఈ సాముహిక కవాతు ప్రదర్శన ద్వారా తన యుద్ధ సన్నద్ధత సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉత్సుకతతో ఉన్నారు కూడా. ఇదిలా ఉండగా, మరోవైపు ఈ వార్షికోత్సవాన్ని కిమ్‌ అడ్వాంటేజ్‌గా తీసుకుని తన అణ్వాయుధాల క్షిపణి సామర్థాన్ని ప్రదర్శిస్తుందేమనని యూఎస్‌ దాని మిత్ర దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. అదీగాక ఇటీవలే దక్షిణ కొరియా, యూఎస్‌ ఉమ్మడి సైనిక విన్యాసాలపై ఉత్తరకొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అలాగే యూఎస్‌ సైనిక ఎత్తుగలను తిప్పికొట్టేలా అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధాలను ప్రయోగిస్తానని బెదిరింపులకు దిగింది కూడా. అంతేగాక ఉత్తరకొరియా 2022లోనే దాదాపు 70 కంటే ఎక్కువ బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. ఇందులో దక్షిణ కొరియాలోని లక్ష్యాలను చేధించడానికి లేదా యూఎస్‌ ప్రధాన భూభాగాన్ని చేరుకునేనే సామర్థ్యం ఉన్న అణ్వయుధాలు ఉన్నాయి. 

(చదవండి: యూఎస్‌లో పోలీసులకు పట్టుబడ్డ తెలుగు అబ్బాయ్‌)

మరిన్ని వార్తలు