గాడిద ఎక్కడున్నా గాడిదే: ఇమ్రాన్‌ ఖాన్‌ కామెంట్లు వైరల్‌

7 May, 2022 11:04 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాక్‌ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. కానీ, ఈసారి రాజకీయ విమర్శతో కాదు.. మరో కారణంతో!  యూకేలో ఉన్నప్పడు తన జీవితం ఎలా ఉండేదో చెప్తూ.. ఆయన చెప్పిన ఓ సామెత ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 

‘‘యూకేకి వెళ్లినప్పుడు నాకు సాదర ఆహ్వానమే దక్కింది. కానీ, దానిని ఎప్పుడూ నా ఇంటిగా అనుకోలేదు. ఎందుకంటే నేను పక్కా పాకిస్థానీని. ఒక గాడిదకు గీతలు(చారలు) పెట్టినంత మాత్రాన.. అది కంచర గాడిద అయిపోదు. గాడిద ఎక్కడున్నా గాడిదే’’ అంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ కామెంట్లు చేశారు. 

ఇందుకు సంబంధించిన క్లిప్‌ ఇప్పుడు విపరీతంగా వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఈ కామెంట్‌తో ఆడేసుకుంటున్నారు.  పాకిస్థాన్‌కు చెందిన కంటెంట్‌ క్రియేటర్‌ జునైద్‌ అక్రమ్‌ నిర్వహించే పాడ్‌కాస్ట్‌లో భాగంగా ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

ఇదిలా ఉండగా.. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంతో ఏప్రిల్‌ 10వ తేదీన పాక్‌ ప్రధాని పీఠం నుంచి ఇమ్రాన్‌ ఖాన్‌ దిగిపోయాడు. ముందస్తు ఎన్నికలకు కోసం ఖాన్‌ డిమాండ్‌ చేస్తున్నప్పటికీ.. మే 2023 కంటే ముందు నిర్వహించడం కష్టమేనని పాకిస్థాన్‌ ఎన్నికల కమిషన్‌ చెప్తోంది.

చదవండి: ఇమ్రాన్‌ ఖాన్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

మరిన్ని వార్తలు