భారత్‌ను కొనియాడిన ఇమ్రాన్‌.. లాహోర్‌ సభలో జైశంకర్‌ వీడియో ప్రదర్శన!

15 Aug, 2022 18:25 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ఏ దేశం ఒత్తిడికీ లొంగకుండా భారత విదేశాంగ విధానం స్వతంత్రంగా ఉందంటూ కొనియాడారు. రష్యా నుంచి చమురు కొనుగోలుతో భారత్‌పై పశ్చిమ దేశాలు విమర్శించటాన్ని తప్పుపడుతూ ఈ మేరకు భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. లాహోర్‌ జాతీయ హాకీ మైదానంలో శనివారం అర్ధరాత్రి బహిరంగ సభలో మాట్లాడారు ఇమ్రాన్‌ ఖాన్‌. అమెరికా ఒత్తిడి ఉన్నా రష్యా నుంచి తక్కువ ధరకు భారత్‌ చమురు కొనుగోలు చేసిందన‍్నారు. 

‘భారత్‌, పాకిస్థాన్‌ ఒకేసారి స్వాతంత్య్రం పొందాయి. విదేశాంగ విధానం విషయంలో భారత్‌ ప్రజానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. ఐరోపా దేశాలు రష్యా నుంచి గ్యాస్‌ను కొనుగోలు చేస్తున్నాయి. భారత ప్రజల కోసం తామూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే తప్పేంటని ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రశ్నించారు.’ అని పేర్కొన్నారు ఇమ్రాన్‌ ఖాన్‌. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జేశంకర్‌ ప్రశ్నించిన వీడియోను సభలో ప్రదర్శించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో అమెరికా ఒత్తిడికి పాకిస్థాన్‌ ప్రభుత్వం లొంగిపోతోందని విమర్శించారు.

ఇదీ చదవండి: తైవాన్‌లో అమెరికా బృందం పర్యటనపై చైనా ఆగ్రహం

మరిన్ని వార్తలు