రూ. 23 కోట్లు కొట్టేసిన కిలాడీ

5 Dec, 2020 11:25 IST|Sakshi

బీమా పాలసీలను పొందడాకి ఓ మహిళ ఎత్తు

పాకిస్తాన్‌: సీమా ఖార్బే అనే పాకిస్తాన్‌కి చెందిన ఓ మహిళ తాను చనిపోయినట్లు నకిలీ పత్రాలను సృష్టించి మోసపూరితంగా 1.5 మిలియన్‌ డాలర్లు(23 కోట్ల రూపాయలు-పాకిస్తాన్‌ కరెన్సీలో) పొందింది. దీనిపై పాకిస్తాన్‌ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఫెడరల్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) అధికారి కథనం ప్రకారం..ఖార్బే 2008-09 సంవత్సరాల్లో యుఎస్‌ వెళ్లి, ఆమె పేరు మీద రెండు భారీ జీవిత బీమా పాలసీలను కొనుగోలు చేసింది. ఆ తరువాత 2011లో పాకిస్తాన్‌లోని కొంతమంది స్థానిక ప్రభుత్వ అధికారులకు, ఓ వైద్యుడికి లంచం ఇచ్చి, తన పేరు మీద నకిలీ మరణ ధృవీకరణ పత్రం, ఖననం చేసినట్లు మరో పత్రం పొందింది. దానిలో భాగంగా  రెండు పాలసీలను క్లెయిమ్‌ చేసుకోవడానికి తన పిల్లల ద్వారా మరణ ధృవీకరణ పత్రాలు ఉపయోగించింది. 

కనీసం పది సార్లు విదేశాలకు
సీమా ఖార్బే చనిపోయినట్లు ప్రకటించిన తరువాత ఆమె కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కనీసం 10 సార్లు విదేశాలకు వెళ్లొచ్చినా అధికారులు గుర్తించలేదు. అయితే అమెరికన్‌ అధికారులు ఖార్బే గురించి పాకిస్తాన్‌ అధికారులను అప్రమత్తం చేయడంతో ఈ మోసంపై దర్యాప్తు ప్రారంభించారు.  ఖార్బేతోపాటు ఆమె కొడుకు, కుమార్తె, కొంతమంది స్థానిక ప్రభుత్వ అధికారులపై ఎఫ్‌ఐఏ మానవ అక్రమ రవాణా సెల్ ప్రస్తుతం క్రిమినల్ కేసులను నమోదు చేసింది.


 

మరిన్ని వార్తలు